23.7 C
Hyderabad
May 8, 2024 05: 24 AM
Slider క్రీడలు

క్రీడాకారిణికి అంబర్ పేట్ ఎమ్మెల్యే ఆర్ధిక సాయం

#amberpetmla

న్యూజిలాండ్ లో జరిగే కామన్ వెల్త్ గేమ్స్ పవర్ లిఫ్టింగ్ పోటీలో చోటు దక్కించుకున్న కుమారి శృతిని అంబర్పేట్ ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అభినందించారు. ఈ సందర్భంగా పెద్ద మనసుతో 50 వేల రూపాయలను నగదు రూపంలో సహాయం చేశారు.

అంబర్పేట్ నియోజకవర్గం కాచిగూడ డివిజన్ కి చెందిన శృతి పవర్ లిఫ్టింగ్ లో ఎల్బీ స్టేడియంలో ట్రైనింగ్ పొందింది. పలు పవర్ లిఫ్టింగ్ పోటీల్లో 76 కేజీ విభాగంలో పలు బహుమతులు కూడా గెలుచుకున్నది. కామన్ వెల్త్ గేమ్స్ లో పాల్గొని విజయం సాధించాలని ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ అభిలషించారు. ఈ సందర్భంగా కుమారి శృతి వారి కుటుంబ సభ్యులు ఎమ్మెల్యేకి కృతజ్ఞతలు తెలిపారు.

సత్యం న్యూస్, అంబర్పేట్

Related posts

తెలంగాణ భవన్ డిప్యూటీ కమిషనర్ పదవీ విరమణ

Satyam NEWS

తిరుమల శ్రీవారి సేవలో బేతి , పన్నాల

Satyam NEWS

హైదరాబాద్ లో నేరాలు తగ్గాయట మీకు తెలుసా?

Satyam NEWS

Leave a Comment