31.2 C
Hyderabad
May 3, 2024 02: 08 AM
Slider ప్రత్యేకం

ఆర్థిక సహాయం కావాలి: గుండె బాధితుని కుటుంబం వేడుకోలు

#financialhelp

‘నా భర్తకు గుండెపోటు వచ్చింది.  ప్రస్తుతం గుండెకు ఆపరేషన్ చేయాలని డాక్టర్స్ సూచించారు.  దానికి 7 లక్షలు ఖర్చవుతుంది. మరోసారి గుండెపోటు వస్తే ప్రాణానికే ప్రమాదం. దాతలు ఆర్థిక సహాయం చేసి ఆదుకోండి’ అంటూ కామారెడ్డి మున్సిపాలిటీ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన నాగళ్ల రమేష్ భార్య, కుటుంబ సభ్యులు వేడుకున్నారు. దేవునిపల్లి గ్రామానికి చెందిన నాగళ్ల రమేష్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో పని చేస్తున్నాడు. గతంలో ఓ సారి గుండెపోటు వచ్చింది.

మరోసారి గుండెపోటు వస్తే ప్రాణానికే ప్రమాదమని వైద్యులు తెలిపారు. నిరుపేద కుటుంబం కావడంతో ఆర్థిక పరిస్థితులు అనుకూలించలేదు. ప్రస్తుతం గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నాడు. దాంతో ఖచ్చితంగా ఆపరేషన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఆపరేషన్ చేయడానికి 7 లక్షల వరకు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. ప్రస్తుతం కాచిగూడ టీఎక్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. తన భర్తకు ఆపరేషన్ చేయడానికి ఆర్థిక సహాయం చేసి ప్రాణాలు నిలపాలని బాధితుని భార్య శ్యామల వేడుకుంది. సహాయం చేయదలచిన వారు గూగుల్ పే నంబర్ 9848540149, AXIS BANK IFC UTIB000103 911010018224463 ఖాతాకు ఆర్థిక సహాయం అందించాలని కోరారు.

Related posts

పేరేచర్ల లో నకిలీ నోట్ల ముఠా అరెస్ట్

Satyam NEWS

కాంగ్రెస్ ను దెబ్బకొట్టిన కోమటిరెడ్డి

Satyam NEWS

ఏజన్సీ లో మెగా వైద్య శిబిరం

Murali Krishna

Leave a Comment