33.7 C
Hyderabad
April 29, 2024 01: 45 AM
Slider విజయనగరం

రోడ్లపై మాస్క్ లు లేకుండా తిరిగితే ఇక అంతేమరి…!

#VijayanagaramPolice

విజయనగరం జిల్లా పోలీసులు ఓ వైపు యాంటీ డ్రగ్స్ నివారణా వారోత్సవాలు నిర్వహిస్తూనే ట్రాఫిక్ ఉల్లంఘనల పై దృష్టి పెడుతున్నారు.

జిల్లా కేంద్రంలో మరీ ఎక్కువ ట్రాఫిక్ నియమనిబంధనలను అతిక్రమిస్తున్నారు.ఈ క్రమంలో ఎస్పీ ఆదేశాలమేరకు ట్రాఫిక్ డీఎస్పీ ఆదేశాలతో నగరంలో ని ట్రాఫిక్ ఎస్ఐ లు భాస్కరరావు, హరి ,ప్రసాద్ లు మరోసారి అవేర్నస్ చర్యలు చేపట్టారు.

ఈ క్రమంలో కోట జంక్షన్ వద్ద మాస్క్ ,పెండింగ్ చలానాలు, హెల్మెట్ లేకుండా వెళుతున్న వాహనాలను ఆపుదల చేసారు.ఏ ఒక్కరూ మాస్క్ లు పెట్టుకోకుండా అలాగే హెల్మెట్ లేకుండా వెళుతున్న వాహనాలను పట్టుకుని చలానాలు వేసారు.

ఈ క్రమంలో నే ఎంపీ రిజిస్ట్రేషన్ కు చెందిన తుఫాను వాహనాన్ని పట్టుకునే క్రమంలో ట్రాఫిక్ ఎస్ఐ తో మాట్లాడతానని చెప్పి అక్కడ నుంచీ జంప్ అయ్యాడు.

తొలి సారి ట్రాఫిక్ పోలీసులు కళ్లుగప్పి అక్కడ నుంచీ స్పీడు గా వాహనాన్ని తీసుకెళ్లడంతో ఆర్టీసి కాంప్లెక్స్, మయూరీ జంక్షన్ వద్ద ట్రాఫిక్ పోలీసులను ఎస్ఐ భాస్కరరావు మేన్ ఫ్యాక్ ద్వారా అలెర్ట్ చేయడంతో ఎట్టకేలకు పోలీసులకు ఫోటో తీసి ఫైన్ వేసారు.

ఏదైనా నగరంలో ట్రాఫిక్ పోలీసులు చుక్కలు చూపిస్తున్నారు.

Related posts

చంద్రబాబు పై కక్షపూరితమైన కేసు నమోదు చేయడం దుర్మార్గం

Bhavani

ఎమ్మెల్యే గంటా రాజీనామా వెనుక వ్యూహం ఏమిటి?

Satyam NEWS

కొత్త మంత్రి గారూ, ఆదోనిలో రోగులకు ఆక్సిజన్ అందడంలేదు

Satyam NEWS

Leave a Comment