మోటారు వాహన నూతన చట్టం అమలులోకి వచ్చాక కారులో హెల్మెట్ పెట్టుకోలేదని, లుంగీతో వాహనం నడిపారని వంటి వింత కారణాలకు జరిమానాలు విధించటంపై కూడా పోలీసులు విమర్శల పాలవుతున్నారు. అటువంటి సంఘటనే ఒకటి రాజస్థాన్‌లో చోటుచేసుకుంది. చెప్పులు వేసుకొని, చొక్కా గుండీలు పెట్టుకోకుండా వాహనం నడిపాడని మథోసింగ్ అనే ట్యాక్సీ డ్రైవర్‌కి చలానా విధించాడు. కానీ జరిమానా మొత్తాన్ని కోర్టు నిర్ణయిస్తుందని పేర్కొన్నారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన సెప్టెంబర్ 6న చోటుచేసుకుంది. ఇప్పటి వరకు రాజస్థాన్ ప్రభుత్వం నూతన మోటారు వాహన చట్టాన్ని అమలులోకి తేలేదు. దీని గురించి రాజస్థాన్ రవాణాశాఖ మంత్రి ప్రతాప్‌సింగ్ ఖచారియావాస్ మాట్లాడుతూ ‘ మేము ఇంకా నూతన మోటారు వాహన చట్టాన్ని అమలుచేయలేదు. ఈ విషయంలో ఇతర రాష్ట్రాల అవలంబించే విధాన్నాన్ని గమనిస్తున్నాము. ఇప్పటికే గుజరాత్ ఈ చట్టాన్ని నీరుగార్చి అమలుచేసింది. మేము వారి కంటే సాధ్యమైనంత తక్కువ జరిమానాల అమలుకు ప్రయత్నిస్తాము’ అని తెలిపారు.
previous post