38.2 C
Hyderabad
May 2, 2024 22: 06 PM
Slider ముఖ్యంశాలు

ప్రథమ స్థానంలో డాగ్ హ్యాండలర్ భరత్ కుమార్

#Bharat Kumar

పోలీసు డాగ్ రూబీ, హ్యాండలర్ భరత్ కుమార్ ను అభినందించిన విజయనగరం జిల్లా ఎస్పీ ఎం.దీపిక
ఇటీవల ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ వింగ్ ఆధ్వర్యంలో మంగళగిరిలో నిర్వహించిన “కెనైన్ ఫస్ట్ ఎయిడ్” శిక్షణలో జిల్లా ఆర్మడ్ రిజర్వు విభాగానికి చెందిన వై. భరత్ కుమార్, పోలీసు డాగ్ రూబీ ప్రధమ స్థానంలో నిలిచారు.

ప్రధమ స్థానంలో నిలిచిన వై. భరత్ కుమార్, డాగ్ రూబీతో కలిసి జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఎం.దీపికను మర్యాద పూర్వకంగా కలవగా, వారిని జిల్లా ఎస్పీ ఎం. దీపిక ప్రత్యేకంగా అభినందించారు. మంగళగిరి లో డిసెంబరు 7 నుండి 23 వరకు ఇంటిలిజెన్స్ సెక్యూరిటీ విభాగం ఆధ్వర్యంలో పోలీసు డాగ్స్ కు అవసరమైన ప్రధమ చికిత్స మరియు వివిధ సేంపిల్స్ కలెక్షన్ గురించి ప్రత్యేక శిక్షణ నిర్వహించారు. ఈ శిక్షణలో డాగ్ హ్యాండలర్ వై. భరత్ కుమార్ మంచి ప్రతిభ కనబర్చారు. అనంతరం, శిక్షణ ముగింపు సమయంలో నిర్వహించిన పరీక్షల్లో వై.

భరత్ కుమార్, పోలీసు డాగ్ రూబీ ప్రధమ స్థానంలో నిలిచారు. పోలీసు డాగ్ రూబీ గతంలో కూడా రాష్ట్ర స్థాయి పోలీసు డ్యూటీ మీట్లో కూడా దాచిపెట్టిన ఎక్స్ ప్లోజివ్ ను కనిపెట్టుటలో మంచి ప్రతిభ కనబర్చి రాష్ట్ర స్థాయిలో తృతియ స్థానంలో నిలిచింది. ఈ కార్యక్రమంలో ఆర్మ్ రిజర్వు అదనపు ఎస్పీ ఎం.ఎం.సోల్మన్, ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి మరియు ఇతర పోలీసు అధికారులు పాల్గొని, హ్యాండలర్ భరత్ కుమార్ ను అభినందించారు.

Related posts

అచ్చెన్నాయుడి బలవంతపు డిశ్చార్జి అన్యాయం

Satyam NEWS

గుడిసెలు తగలబె ట్టిన వారిని వెంటనే శిక్షించాలి: సీపీఎం డిమాండ్

Satyam NEWS

హెరాస్ మెంట్: భర్త ఇంటి ముందు భార్య ఆందోళన

Satyam NEWS

Leave a Comment