37.2 C
Hyderabad
May 2, 2024 13: 55 PM
Slider పశ్చిమగోదావరి

పశ్చిమగోదావరి జిల్లాలో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్

#fitindia

నెహ్రు యువకేంద్ర- యువజన వ్యవహారాలు మరియు క్రీడా మంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ‘అజాది కి అమృత్ మహోత్సవం ‘ కార్యక్రమం లో భాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ (2k రన్ ) కార్యక్రమాన్ని పశ్చిమగోదావరి జిల్లా పెదపాడు ZPH స్కూల్ ఆవరణలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన పెదపాడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం డాక్టర్. చక్రధర్ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ మనిషి ఆరోగ్యంగా ఉండాలి అంటే వ్యాయామం అవసరం అని చెప్పారు.

అలాగే స్కూల్ ప్రధాన ఉపాధ్యాయులు రోస్లిన్ లీనా మాట్లాడుతూ శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి అంటే నడవడం, వ్యాయామం చేయడం వంటివి చేయాలి అని చెప్పారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసికంగా కూడా ఆరోగ్యంగా ఉండాలి అని చెప్పారు. అలాగే వ్యాయామ ఉపాధ్యాయులు మాట్లాడుతూ అందరూ శారీరకంగా ఆరోగ్యంగా ఉండాలి వ్యాయామాలు చెయ్యాలి అని చెప్పారు. ఈ కార్యక్రమం లో ఉపాధ్యాయ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది,  మరియు నెహ్రు యువకేంద్ర వాలంటీర్స్ పాయం సింధు, తేజ బాబు విద్యార్థిని విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

విదేశాల్లో యోగ విద్య విస్తరణకు కృషి

Satyam NEWS

బ్లాక్ మెయిల్ చేసిన ముగ్గురు సూర్య పత్రిక విలేకరుల అరెస్టు

Satyam NEWS

చెరువుల్లో చేప పిల్లలు విడుదల చేయాలి

Murali Krishna

Leave a Comment