పోలీసు నియామక ప్రక్రియలో భాగంగా విశాఖపట్నం జోన్ కు సంబంధించి ఎస్సై ఉద్యోగాల ప్రాథమిక రాత పరీక్షలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు అర్హత సాధించిన అభ్యర్ధులకు విశాఖపట్నం, కైలాసగిరి ఆర్మ్డ్ రిజర్వ్ పోలీసు మైదానంలో 2023 ఆగస్టు 25వ తేది నుండి దేహదారుడ్య పరీక్షలు జరుగుతున్నాయి. గత నెల ఆగస్ట్ 25 వ తేది నుండి ఇప్పటి వరకు దేహదారుడ్య పరీక్షలకు హాజరు కాని ఎస్సై అభ్యర్దులు సెప్టెంబర్ 23 వ తేదిన హాజరు కావచ్చన్నారు…విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ. ఇప్పటివరకు హాజరుకాని మహిళా అభ్యర్థులు సెప్టెంబర్ 22న హాజరు కావచ్చునని విశాఖ రేంజ్ డీఐజీ హరికృష్ణ తెలిపారు.
previous post
next post