మీరు చదివింది నిజమే. నిజంగానే దుబాయ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఎంతగా వర్షాలు కురుస్తున్నాయంటే అక్కడ రోడ్లన్నీ జలమయం అయ్యాయి. రాకపోకలు బంద్ అయ్యాయి. భారీ వర్షాల కారణంగా రాస్ అల్ ఖైమాలోని జెబెల్ జైస్‌కు వెళ్లే రహదారి మూసివేశారు.
ఈ ప్రాంతంలో భారీ వర్షాలు కురవడంతో చాలా చోట్ల ట్రాఫిక్ స్థంభించిపోయింది. అందుకే ఈ రోడ్లపైకి రావద్దని సోషల్ మీడియాలో రాస్ అల్ ఖైమా పోలీసులు ప్రచారం చేస్తున్నారు. ప్రజల భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని, పరిస్థితిని పర్యవేక్షిస్తున్నామని అధికారులు తెలిపారు.
ఇంతకీ దుబాయ్ లో ఇంతలా వానలు ఎలా పడుతున్నాయి? ఇంత భారీ వర్షాలు ఎలా ఎందుకు కురుస్తున్నాయంటే అక్కడి ప్రభుత్వం క్లౌడ్ సీడింగ్ చేసి కృత్రిమ వర్షాలు కురిపిస్తున్నది. అదీ సంగతి. నాలుగు రోజులుగా క్లౌడ్ సీడింగ్ కారణంగా యుఎఇలో భారీ వర్షాలు కురుస్తున్నాయి.