29.7 C
Hyderabad
May 3, 2024 06: 54 AM
Slider హైదరాబాద్

వరద నీటి సమస్యకు శాశ్వత పరిష్కారం

#madhavaram

వరద నీటి సమస్యకు శాశ్వతంగా పరిష్కరించేందుకు కృషి చేస్తానని జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్‌లో కుండపోత వర్షాలు కురిసినా ప్రజలకు వరద నీటి ప్రభావం లేకుండా ఉండేందుకు, మళ్లీ ప్రజలకు ముంపు పీడ ఉండొద్దనే కృతనిశ్చయంతో, మంత్రి కేటీఆర్‌కు సీఎం కేసీఆర్‌ స్పష్టమైన ఆదేశాలతో నాలాలకు శాశ్వత  పరిష్కారం దిశగా నాలాలను అభివృద్ధి చేస్తామని కమిషనర్ రోనాల్డ్ రాస్ తెలిపారు. బుధవారం కూకట్ పల్లి నియోజకవర్గంలోని ఫతే నగర్, అల్లాపూర్ డివిజన్ లలో లోతట్టు ప్రాంతాలను ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు, జిహెచ్ఎంసి కమిషనర్ రోనాల్డ్ రాస్, జోనల్ కమిషనర్ మమతలు కలిసి పరిశీలించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు మాట్లాడుతూ భారి వర్షాలలో మునిపోతున్న కాలనీలను అభివృధి చేయాలని, నాల అభివృధి చేస్తూ ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ లు అందజేయాలని కమిషనర్ రోనాల్డ్ రాస్ కు ఎమ్మేల్యే మాధవరం కృష్ణారావు వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం కమిషనర్ రోనాల్డ్ రాస్ మాట్లాడుతూ త్వరలోనే టెండర్ ప్రక్రియ ఏర్పాటు చేసి నాలా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. లోతట్టు ప్రాంతాలలో మునిగిపోయిన ప్రాంతాల నాళాలను అభివృధి చేస్తామని, భారి వర్షాలతో మునిగిపోతున్న ఇండ్లను ఖాళీ చేపించి నాల వెడల్పు చేస్తామని, నాల వెడల్పులో ఇండ్లు కోల్పోయిన వారికి డబుల్ బెడ్ రూమ్ లు అందజేస్తామని తెలిపారు.

సత్యం న్యూస్, మేడ్చల్ జిల్లా

Related posts

సినీఫక్కీలో హత్య కేసు నిందితుల అరెస్టు

Satyam NEWS

అన్యాయం చేస్తున్న కలెక్టర్.. లాఠీలతో కొట్టిన పోలీసులు

Satyam NEWS

నెమ్లీ సాయిబాబా మందిరానికి భక్తుల పాదయాత్ర

Satyam NEWS

Leave a Comment