40.2 C
Hyderabad
April 29, 2024 15: 05 PM
Slider ఖమ్మం

ప్రాధాన్యత పనులపై ద్రుష్టి పెట్టాలి

#Collector V.P

ప్రాధాన్య పనులపై ప్రత్యేక దృష్టి పెట్టి, త్వరితగతిన లక్ష్యం సాధించాలని జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో మునిసిపల్ కమీషనర్లతో గృహాలక్షి, జీవో 59, లేఅవుట్ ల ప్రగతిపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గృహాలక్షి పథకానికి సంబంధించి, సత్తుపల్లి మునిసిపల్ పరిధిలో 1090, మధిర మునిసిపల్ పరిధిలో 1327, వైరా మునిసిపల్ పరిధిలో 1351 దరఖాస్తులు వచ్చినట్లు తెలిపారు.

మునిసిపల్ కమీషనర్లు దరఖాస్తుల్లో కనీసం 10 శాతం సూపర్ చెక్ క్రింద స్వయంగా పరిశీలన చేయాలన్నారు. అర్హత గల దరఖాస్తుల ఆన్లైన్ నమోదు ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో ఫోటోలు, జిపిఎస్ మ్యాపింగ్ చేయాలన్నారు. మునిసిపాలిటీ ల వారిగా లే అవుట్ దరఖాస్తులు, ప్లాట్ల వివరాలు సమీక్షించారు.

సెప్టెంబర్ కల్లా క్షేత్ర పరిశీలన పూర్తి చేయాలన్నారు. జీవో 59 క్రింద రెండో విడత డిమాండ్ నోటీస్ ల జారీ పూర్తి చేయాలని, మొదటి విడత డిమాండ్ వసూళ్లపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అన్నారు. రెండో విడత డిమాండ్ విషయంలో దరఖాస్తుదారులకు ముందస్తుగా పూర్తి అవగాహన కల్పిస్తున్నందున డిమాండ్ మొత్తం వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.

మునిసిపాలిటీలకు కేటాయించిన విఆర్వో, విఆర్ఏ లకు వార్డులు కేటాయించి, వారికి విధులు అప్పగించాలన్నారు.ఈ సమీక్షలో సత్తుపల్లి, మధిర, వైరా మునిసిపల్ కమీషనర్లు సుజాత, రమాదేవి, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Related posts

తాపీ మేస్త్రీల సంఘం ఆధ్వర్యంలో శిక్షణ పత్రాల పంపిణీ

Satyam NEWS

గౌడ కుల సోదరులకు అండగా ఉంటా: బండారి  లక్ష్మారెడ్డి

Satyam NEWS

ఎలక్షన్ ట్రిక్స్:బీజేపీ అభ్యర్థి బీ ఫారంను చింపేసాడు

Satyam NEWS

Leave a Comment