35.2 C
Hyderabad
April 30, 2024 23: 46 PM
Slider ఖమ్మం

ఫ్లాగ్ షిప్ కార్యక్రమాలపై దృష్టి పెట్టాలి

#flagship programs

ప్రభుత్వ ఫ్లాగ్ షిప్ కార్యక్రమ అమలుపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్‌ వి.పి. గౌతమ్‌ అన్నారు. డిపిఆర్సీ భవన సమావేశ మందిరంలో అధికారులతో దశాబ్ది సంపద వనాలు, ఆసరా పింఛన్లు, జి.ఓ.59, గృహలక్ష్మీ, రెగ్యులరైజేషన్ ఆఫ్ నోటరీ డాక్యుమెంట్లు, కారుణ్య నియామకాలు, భూ సేకరణ తదితర అంశాలపై కలెక్టర్‌, అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, సంపద వనాల ఏర్పాటుకు ఇర్రిగేషన్ శాఖ భూములను గుర్తించాలన్నారు. గుర్తించిన భూములలో బ్లాక్ ప్లాంటేషన్ కు చర్యలు చేపట్టాలన్నారు. ఆసరా పెన్షన్లకు సంబంధించి, ఎవరైనా వృద్దాప్య పెన్షన్ పొందుతూ మరణిస్తే, వారి స్థానంలో వారి భార్యకు 57 సంవత్సరాల లోపు వయస్సు ఉంటే వితంతు, 57 సంవత్సరాలు వయస్సు దాటితే వృద్దాప్య పెన్షను వెంటనే మంజూరుకు అవకాశం ఉందని, ఈ దిశగా ప్రజల్లో అవగాహన కల్పించి, ప్రచారం చేయాలన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 1979 దరఖాస్తులు పరిష్కరించినట్లు ఆయన అన్నారు.

గృహలక్ష్మీ దరఖాస్తుల పరిశీలన ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి, పూరెస్టు పూర్ కు పథక లబ్ది తప్పక అందేలా చర్యలు చేపట్టాలన్నారు. జి.ఓ 59 లో ఆమోదించిన దరఖాస్తులన్నింటికి డిమాండ్‌ జారీచేసి, డిమాండ్‌లకు సంబంధించిన వసూళ్ల వేగవంతం చేయాలన్నారు. కారుణ్య నియామకాల దరఖాస్తుల ప్రక్రియ పూర్తి చేసి జిల్లాలో ఖాలీగా ఉన్న పోస్టులలో అర్హత ప్రకారం భర్తీకి చర్యలు తీసుకోవాలన్నారు.

సాంఫీుక సంక్షేమ ఇంటి స్థలాల పంపిణీ ప్రక్రియను వేగవంతం చేయాలని, అర్హులుగా గుర్తించబడ్డ వారికి స్థలాల పంపిణీ వెంటనే పూర్తి చేయాలన్నారు. నోటరైజ్డ్‌ డాక్యుమెంట్ల క్రమబద్దీకరణకు అందిన దరఖాస్తుల పరిశీలన త్వరితగతిన పూర్తి చేయాలని కలెక్టర్‌ అధికారులను ఆదేశించారు. ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ భూసేకరణ ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని, ఫ్యాక్టరీ సెప్టెంబర్ మాసంలో గ్రౌండింగ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. వివిధ ప్రాజెక్టుల భూసేకరణ ప్రక్రియ పనులు వేగం చేయాలన్నారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ డి. మధుసూదన్‌ నాయక్‌, సి.పి.ఓ. శ్రీనివాస్‌, ఆర్డీవో లు జి.గణేష్‌, అశోక్ చక్రవర్తి, ఎస్‌డిసి రాజేశ్వరి, ఏడి సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ శ్రీనివాసులు, కలెక్టరేట్‌ ఏ.ఓ. ఆరుణ, సూపరింటెండెంట్‌ మదన్‌గోపాల్‌, ఇర్రిగేషన్ అధికారులు, తహశీల్దార్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దేందుకు తాత్వికత బోధించాలి

Satyam NEWS

శేష వాహనం పై ఒంటిమిట్ట కోదండరాముడు….

Satyam NEWS

కరోనా బాధిత కుటుంబాలకు అండగా ఎమ్మెల్యే సీతక్క

Satyam NEWS

Leave a Comment