38.2 C
Hyderabad
April 29, 2024 20: 56 PM
Slider ఖమ్మం

ఆపరేషన్ ముస్కాన్ -IX ద్వారా 35 మంది బాలలకు రక్షణ

#SP Dr. Vineeth

జులై ఒకటో తారీకు నుండి 31 వ తారీకు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ ముస్కాన్ – IX ద్వారా జిల్లాలో 35 మంది బాలలను సంరక్షించినట్లుగా కొత్తగూడెం జిల్లా ఎస్పీ డా.వినీత్ వెల్లడించారు.35 మంది బాలలలో 30 మంది మగ పిల్లలు,05 గురు బాలికలను గుర్తించడం జరిగిందని తెలిపారు.ఇందులో ఇతర రాష్ట్రానికి చెందినవారు 10 మంది బాలురు,01 బాలిక ఉన్నట్లు తెలిపారు.

వ్యాపార సముదాయాలలో,పరిశ్రమలలో మరియు ఇతర ప్రదేశాలలో బాల బాలికలతో పనులు చేయిస్తున్న 28 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలియజేసారు.ఆపరేషన్ ముస్కాన్ ద్వారా సంరక్షించిన బాలబాలికలు 33 మందిని వారి తల్లిదండ్రులకు అప్పగించడం జరిగిందని తెలిపారు.ఇద్దరిని బాలుర సంరక్షణ గృహాంలో అప్పగించడం జరిగిందని అన్నారు.

బాలకార్మిక రహిత జిల్లాగా మార్చడమే పోలీసుల ప్రధాన లక్ష్యమని తెలిపారు. బాల బాలికలతో ఎవరైనా చాకిరీ చేయించుకుంటున్నట్లు తెలిస్తే వెంటనే పోలీస్ వారికి సమాచారం అందించాలని కోరారు.ఆపరేషన్ ముస్కాన్ బృందంలో పనిచేసిన అధికారులను ఈ సందర్భంగా అభినందించారు.

Related posts

భారత రాష్ట్రపతి ద్రౌపదిముర్ము శ్రీశైల పర్యటనకు పకడ్బందీగా ఏర్పాట్లు

Bhavani

తెలంగాణ రాష్ట్ర రైతు సంఘం మహాసభలను జయప్రదం చేయండి

Satyam NEWS

పదో తరగతి చదువుతున్న బాలుడి దారుణ హత్య

Satyam NEWS

Leave a Comment