38.2 C
Hyderabad
April 29, 2024 21: 00 PM
Slider ప్రకాశం

రైత సంక్షేమాన్ని విస్మ‌రించే ఏ చ‌ట్టాల‌నైనా వ్య‌తిరేకిస్తాం

Former Bill

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు రైతు వ్యతిరేక బిల్లులను తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోందని, రైతులకు కనీస మద్దతు ధర ప్రకటించకుండా, రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని, దళారీ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా ఈ చట్టాలు ఉన్నాయని, రైతు సంక్షేమాన్నిదెబ్బతీసే ఏ చట్టాల‌నైనా తెలుగుదేశం పార్టీ వ్యతిరేకిస్తోందని ఆ పార్టీ ఒంగోలు పార్లమెంటు అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ పేర్కొన్నారు.

తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం చేసిన మూడు వ్యవసాయ బిల్లును వ్యతిరేకిస్తూ జిల్లా కలెక్టర్లకు వినతి పత్రం సమర్పించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా ప్రకాశం భవన్ వద్ద నూకసాని బాలాజీ విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ.. దుర్మార్గమైన ఇటువంటి రైతులకు ఎటువంటి కేంద్ర ప్రభుత్వం వ్యవసాయ బిల్లుల్ని వ్యతిరేకిస్తామని కనీస మద్దతు ధర ప్రకటించాలని, అటువంటి తరుణంలో దానిని ప్రకటించకుండా, దళారీ వ్యవస్థను ప్రోత్సహించే విధంగా చట్టాలు ఉన్నాయని విమ‌ర్శించారు. రాజ్యసభలో ఈ బిల్లులకు సవరణలను తెలుగుదేశం పార్టీ సూచించిన అని ఆయన గుర్తు చేశారు.

తెలుగుదేశం పార్టీ ఇప్పుడు ప్రజల పక్షం మాత్రమేనని నాడు రాజ్యసభలో రైతు బిల్లుకి మద్దతు ఇచ్చిన ఇటువంటి పార్టీలు నేడు పెరుగుతున్నభారత్ బంద్ కు మద్దతు ఇస్తున్నాయని, లోపల ఒక రకంగా బయటకు మ‌రో రకంగా వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం టీడీపీకి లేదని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు డాక్టర్ నూకసాని బాలాజీ, రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ లీడ్ క్యాప్ చైర్మన్ గూడూరి ఎరిక్షన్ బాబు, రాష్ట్ర కార్యదర్శి కామరాజుగడ్డ కుసుమకుమారి, దర్శి నియోజకవర్గ కోఆర్డినేటర్ పమిడి రమేష్, ఒంగోలు మాజీ ఏఎంసీ చైర్మన్ కామేపల్లి శ్రీనివాస రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి గుర్రాల రాజ్ విమల్, ఒంగోలు నగర అధ్యక్షులు కొఠారి నాగేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి దాయనేని ధర్మ, ఒంగోలు నగర తెలుగు మహిళ అధ్యక్షురాలు పసుపులేటి సునీత, విలేజ్ ఖాదీ బోర్డ్ మాజీ డైరెక్టర్ దాసరి వెంకటేశ్వర్లు, రాష్ట్ర తెలుగు మహిళా నాయకులు ఆర్ల వెంకటరత్నం, ఉప్పలపాటి నాగేంద్రమ్మ, టి.అనంతమ్మ, ఒంగోలు నగర ఎస్సి సెల్ అధ్యక్షులు నావూరి కుమార్, ప్రధాన కార్యదర్శి కసుకుర్తి అంకరాజు, తెలుగు మహిళా నాయకులు టి ఉమామహేశ్వరి, షేక్ అజిమున్నిస్సా, నల్లూరి నాగేశ్వరమ్మ, తెదేపా సీనియర్ నాయకులు పాతూరి పుల్లయ్య చౌదరి, ఎద్దు శశికాంత్ భూషణ్, పెల్లూరు చిన్న వెంకటేశ్వర్లు, చుండి శ్యాం, జి ఎస్ ఆర్ , బసెం శీను, చల్లా హరి, బండారు మదన్, పీ.వెంకటేశ్వర్ రెడ్డి, మన్నేపల్లి హరికృష్ణ, పూసపాటి జాలి రెడ్డి, పవన్, కె.సెల్వం, కే శ్రీను, తదితరులు పాల్గొన్నారు.

Related posts

కఠిన చర్యలు తీసుకోకుంటే.. మూడో వేవ్

Sub Editor

అంధత్వ నివారణ తెలంగాణ లక్ష్యం

Bhavani

సర్వం సమాప్తం: బీజేపీకి ఇక నూకలు చెల్లినట్లే

Satyam NEWS

Leave a Comment