39.2 C
Hyderabad
May 3, 2024 11: 23 AM
Slider వరంగల్

రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాలి

Mulugu-1

ఢిల్లీలో ఉద్యమం చేస్తున్న రైతులకు మద్దతుగా ములుగు మండలం కాసిందేవి పేట గ్రామంలో ర్యాలీ నిర్వ‌హ‌ణ‌లో తెలంగాణ రైతు సంఘం ములుగు జిల్లా కార్యదర్శి ఎండి గపూర్ పాషా పాల్గొన్నారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ తీసుకొచ్చిన వ్యవసాయం నల్ల చట్టాలను రద్దు చేయాలని ఢిల్లీలో ఎముకలు కొరికే చలిని సైతం లెక్కచేయకుండా రైతులు ఆందోళన చేస్తుంటే వారి సమస్యలను పరిష్కరించకుండా మోడీ ప్రభుత్వం చర్చల పేరుతో కాలయాపన చేస్తూ రైతు ఉద్యమాన్ని నీరుగార్చే ప్రయత్నం చేస్తోంద‌ని దుయ్య‌బ‌ట్టారు.

భారతదేశం వ్యవసాయాన్ని కార్పొరేట్ శక్తుల చేతుల్లో పెట్టడానికి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుని పని చేస్తుంద‌న విమ‌ర్శించారు. ఒక వైపు ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముకుంటూనే, వ్యవసాయ రంగాన్నికూడా పెట్టుబడిదారులు చేతిలో పెట్టడానికి మోడీ ప్రభుత్వం కృషి చేస్తోంద‌ని ఆరోపించారు. నేడు రైతాంగం రోడ్డు మీదికి వచ్చి ఉద్యమం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింద‌ని, మోడీ ప్రభుత్వ తీరు మార్చుకొని వ్యవసాయం చట్టాలను రద్దుచేసి స్వామినాథన్ కమిషన్ సిఫార్సులకు అనుగుణంగా గిట్టుబాటు ధర చట్టాన్నిరుణ విమోచన చట్టాన్నిపార్లమెంటులో చట్టం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ధాన్యాన్నిబోనస్ ఇచ్చి రెండు వేల ఐదు వందలు చొప్పున కొనుగోలు చేయాలని పై సమస్యల సాధన కోసం రైతాంగం రాజకీయ పార్టీలకతీతంగా ఉద్యమం చేస్తారని అన్నారు.

రైతాంగ సమస్యల పరిష్కారం పూర్తయ్యేవరకు తెలంగాణ రైతు సంఘం రైతుల పక్షాన నిలబడి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిర్లక్ష్యం వైఖరికి వ్యతిరేకంగా పోరాటం చేస్తుందని ఈ రోజు జరుగుతున్న భారత్ బంద్ కు సహకరించిన ప్రజలకు వ్యాపార వర్గానికి ఉద్యోగ వర్గానికి కార్మిక కర్షకులకు వివిధ రాజకీయ పార్టీల నాయకులకు అందరికీ పేరుపేరునా తెలంగాణ రైతు సంఘం జిల్లా కమిటీ నుండి విప్లవ అభినందనలు తెలియజేస్తున్నామ‌న్నారు.

ఈ కార్యక్రమంలో రైతులు హమాలీ కార్మికులు సిరికొండ చంద్రమౌళి, కట్ల నరేష్, కట్కూరి శ్యామల్, మండల సాంబయ్య, సకినాల రఘు, కురుమ రాజయ్య, కనకం రంజిత్, గుంజ రాములు, గుంజ రమేష్, కవ్వం పెళ్లి ప్రకాష్, కట్ల స్వామి, 50 మంది పాల్గొన్నారు.

Related posts

సీక్రెట్ జీవోలు ఎందుకు? విసుక్కుంటున్న అధికారులు

Bhavani

ఎలారమింగ్: దేశవ్యాప్తంగా మూతపడుతున్న పత్రికలు

Satyam NEWS

సాక్షి కొనుగోళ్లపై కేసు వేసినందుకే రామోజీరావుకు వేధింపులు

Satyam NEWS

Leave a Comment