23.2 C
Hyderabad
May 7, 2024 21: 58 PM
Slider ఆదిలాబాద్

బాలల హక్కుల చట్టం అమలుకు పటిష్ట చర్యలు

nirmal collector

బాలల హక్కులు హరించే వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు బాలల హక్కుల రక్షణ చట్టం పకడ్బందీగా అమలు చేయాలని జాతీయ బాలల హక్కుల రక్షణ కమిషన్ సభ్యురాలు ప్రజ్ఞా పరాండే అన్నారు. శనివారం నిర్మల్ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఐ సి డి ఎస్, విద్య, వైద్య, పోలీస్, ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీ శాఖల అధికారులతో నిర్వహించిన ఈ సమావేశంలో ఆమె పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బాలల హక్కులను పరిరక్షణకు అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. బాలల రక్షణ కోసం కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు విశేష కృషి చేస్తున్నాయన్నారు. బాలల రక్షణ కోసం ఫోక్సో చట్టం, విద్యాహక్కుచట్టం జూనైల్ జస్టిస్ వంటి విభాగాలు పనిచేస్తున్నాయన్నారు.

జిల్లాలో ఎన్నో రకాల బాలలకు చెందిన సమస్యలు ఉంటాయని వాటిని పరిష్కరించేందుకు అధికారులు బాధ్యతాయుతంగా కృషి చేయాలన్నారు. కేంద్ర ప్రభుత్వం 115 జిల్లాలను వెనకబడిన జిల్లాలు గా గుర్తించిందని జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ 50 జిల్లాలలో బాలల హక్కుల పై సమీక్షించేందుకు నిర్ణయించిందన్నారు. దేశంలోని మారుమూల మరియు మంచుకొండల్లో ఉన్నటువంటి జిల్లాలలో బాలల హక్కుల పరిరక్షణకై పర్యటించనున్నట్లు తెలిపారు.

జిల్లాలో పర్యటించి పిల్లల సమస్యలు తెలుసుకొని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. బాలల హక్కుల చట్టాలు అమలు జరిగేలా చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు తాను దేశవ్యాప్తంగా 48 క్యాంపులు నిర్వహించినట్లు అందులో  బాలల సమస్యలకు సంబంధించిన 20వేల ఫిర్యాదులు అందినట్లు వాటిని వెంటనే పరిష్కారం చేయుటకు సంబంధిత అధికారులను ఆదేశించినట్లు తెలిపారు.

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ జిల్లాలో శుక్రవారం నిర్వహించిన క్యాంపులో 562 దరఖాస్తులు అందాయని తెలిపారు. బాలల హక్కుల అమలులో విధానపరమైన నిర్ణయాలను అమలు చేసే లక్ష్యంగా చర్యలు తీసుకుంటమని ఆమె తెలిపారు. రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిటీ సభ్యులు అనుమాండ్ల శోభారాణి మాట్లాడుతూ పిల్లల సమస్యలు, హక్కుల అధికారులు స్వచ్ఛంద సంస్థలు సమన్వయంతో పనిచేయాలన్నారు.

ప్రతి పాఠశాలలో సైక్రియాటిస్ట్ ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. పాఠశాలల్లో, రెసిడెన్షియల్ పాఠశాలలో, కేజీబీవీ పాఠశాలలోని బాలల సమస్యల పరిష్కారానికి దృష్టి కేంద్రీకరించాలని జిల్లా విద్యాధికారి సూచించారు. ఐదు నుంచి పది సంవత్సరాల లోపు అంగవైకల్యం గల పిల్లలను గుర్తించి సదరం సర్టిఫికెట్ ఇప్పించాలి అన్నారు.

ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ఎం ప్రశాంతి, జిల్లా ఎస్పీ శశిధర్ రాజు, మహిళా శిశు సంక్షేమ అధికారి రాజగోపాల్, సిడబ్ల్యూసి చైర్మన్ అమృత రావు, సభ్యులు యాకుబ్ బేగ్, జిల్లా బాలల పరిరక్షణ అధికారి మురళి, జిల్లా రెవెన్యూ అధికారి సోమేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.

ఇంకా ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ శ్రీనివాస రావు, డీఎస్పీ ఉపేందర్ రెడ్డి, జిల్లా విద్యాధికారి టీ ప్రణీత, జిల్లా ఎస్సీ అభివృద్ధి అధికారి కిషన్ యాదవ్, జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి శ్రీనివాస్ రెడ్డి, ఐ సి డి ఎస్ సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు తదితరులు కూడా పాల్గొన్నారు.

Related posts

బిబిసి పై కేంద్ర నిరంకుశ వైఖరికి నిరసన

Bhavani

ఘనంగా ఏఎస్ఆర్ జన్మదిన వేడుకలు

Satyam NEWS

పేద ప్రజల సంక్షేమానికి ప్రభుత్వం కృషి

Satyam NEWS

Leave a Comment