28.2 C
Hyderabad
May 9, 2024 01: 15 AM
Slider ముఖ్యంశాలు

నాగర్ కర్నూల్ జిల్లాలో ఉచిత పాఠ్య పుస్తకాల పంపిణీ ప్రారంభం

#nagarkurnooldeo

నాగర్ కర్నూలు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచితంగా అందజేసే పాఠ్యపుస్తకాలు జిల్లా నుండి మండలాలకు  చేరుకున్నాయి. ప్రాఠశాలల విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేసేందుకు జిల్లా విద్యాశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. 2022–23 విద్యా సంవత్సరంలో మన ఊరు మనబడి కార్యక్రమంలో కొత్త ప్రవేశాలు పొందిన వారితో పాటు ప్రస్తుతం చదువుతున్న విద్యార్థులకు ఈ పాఠ్యపుస్తకాలను అందించనున్నారు. 

పుస్తకాల కొరత లేకుండా విద్యా సంవత్సరం బోధన సాఫీగా జరిగేలా విద్యాశాఖ చర్యలు తీసుకుంటుంది.  జిల్లాకు అవసరమైన 5,05300 పాఠ్యపుస్తకాల ప్రతిపాదనలను రాష్ట్ర విద్యాశాఖకు పంపింది. దీంతో ఇప్పటి వరకు వచ్చిన 1,76,819 పుస్తకాలను జిల్లా గోదాం నుండి మండలాలకు పంపిణీ కార్యక్రమాన్ని శనివారం డిఈఓ ప్రారంభించారు.

జిల్లాకు 1,76,819 పుస్తకాలు

జిల్లాలోని ప్రభుత్వ జెడ్పీ, ఉన్నత,కేజీబీవి, మోడల్‌ పాఠశాలలతో పాటు సంక్షేమ, గురుకుల పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఉచిత పాఠ్యపుస్తకాలను అందజేయనున్నారు. ఆయా పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మొత్తం 5,05,300 పుస్తకాలు అవసరమని జిల్లా విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదించింది. గత విద్యా సంవత్సరం పంపిణీ చేయగా మిగిలిన 1250 పాఠ్యపుస్తకాలు గోదాంలో మిగిలి ఉన్నాయి.

 ఇంకా జిల్లాకు 5,05300 జిల్లాకు రావల్సి ఉండగా 1,76,819 రాగా మరో 3,28,481 పుస్తకాలు రావాల్సి ఉంది. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా అందజేసే పాఠ్యపుస్తకాలను తెలుగు మరియు ఆంగ్ల  రెండు భాషల్లో ఓకే పాఠ్యపుస్తకాన్ని  ముద్రించనున్నందున్న . పాఠ్యపుస్తకాలు ఆలస్యంగా వస్తున్నాయని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు.

ఎడమ వైపు పేజీలో ఇంగ్లిష్‌, కుడి వైపు పేజీలో తెలుగు లేదా ఆయా విద్యార్థులకు సంబంధించిన మాతృభాషలో పుస్తకా ముద్రణ ఉన్నాయన్నారు. సర్కార్‌ స్కూళ్లలో 1 నుండి 8వ తరగతి వరకు ఇంగ్లిష్‌ మీడియంను ప్రవేశపెట్టిన నేపథ్యంలో విద్యార్థుల సౌలభ్యం కోసం రాష్ట్ర విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుందని అన్నారు.

దీనివల్ల ఇంగ్లిష్‌ సరిగా అర్థంకాని విద్యార్థులు తమ మాతృభాషలో ఉన్న పాఠాన్ని చదువుకోవడం ద్వారా సులభంగా అర్థం చేసుకోవచ్చునని డిఈఓ అన్నారు. ఇంగ్లిష్‌లో పదాలు, వాక్యాలను రాసే విధానాన్ని విద్యార్థులు తేలికగా నేర్చుకోవచ్చున్నారు. మాతృభాషను కాపాడుకోవడానికీ ఇది ఉపకరిస్తుందని తెలిపారు. 

ద్విభాషా పుస్తకాలను ఈ విద్యాసంవత్సరం నుంచే నేటి నుండి విద్యార్థులకు పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించామన్నారు. ప్రస్తుతానికి 1 నుంచి 8 తరగతుల వరకు అన్ని సబ్జెక్టుల పుస్తకాలను 2 భాషల్లో,తెలుగు, హిందీ, ఉర్దూ, ఇంగ్లిష్‌ వంటి భాషా పుస్తకాలు మాత్రం ఎప్పటిమాదిరిగానే ఒకే భాషలో ఉంటాయన్నారు.

వీటిని మినహాయించి సైన్స్‌, గణితం, సాంఘికశాస్త్రం పుస్తకాలను ద్విభాషల్లో ఉన్నాయన్నారు. 3,4,5 తరగతుల్లో పరిసరాల విజ్ఞానం, 6,7,8 తరగతుల్లో గణితం, సైన్స్‌, సోషల్‌స్టడీస్‌ పుస్తకాలను ద్విభాషా పుస్తకాలుగా అందుబాటులోకి వచ్చాయని తెలిపారు.

జిల్లాకు చేరుకున్న పాఠ్యపుస్తకాలను వచ్చిన వచ్చినట్లుగానే మండలాలకు పంపిణీ చేసి పాఠశాలల ద్వారా విద్యార్థులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నమని డిఈవో గోవిందరాజులు తెలిపారు.

అవుట రాజశేఖర్, సత్యంన్యూస్.నెట్, నాగర్ కర్నూల్ జిల్లా

Related posts

నెల్లూరు జిల్లా కలెక్టర్ ను కలిసిన నేషనల్ లెవల్ మోనిటరింగ్ టీమ్

Satyam NEWS

హరితహారం నర్సరీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు

Satyam NEWS

వలస కూలీల ఆటోను ఢికొట్టిన లారి: ఒకరు మృతి

Bhavani

Leave a Comment