38.2 C
Hyderabad
April 28, 2024 21: 56 PM
Slider నెల్లూరు

నెల్లూరు జిల్లా కలెక్టర్ ను కలిసిన నేషనల్ లెవల్ మోనిటరింగ్ టీమ్

#nellore

నెల్లూరు జిల్లాలో  జాతీయ గ్రామీణ  ఉపాధి హామీ  పధకం ద్వారా  జరుగుతున్న పనులను ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పధకం కింద  నిర్మిస్తున్న  గృహ నిర్మాణ పనులను పరిశీలించడంలో బాగంగా  జిల్లాకు విచ్చేసిన  నేషనల్ లెవల్ మోనిటరింగ్ టీమ్ సభ్యులు పి. సంతోష్, రీనా దేశాయి సోమవారం ఉదయం జిల్లా కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్  కె.వి.ఎన్. చక్రధర్ బాబును మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా  జిల్లా కలెక్టర్  కె.వి.ఎన్. చక్రధర్ బాబు,  జాతీయ గ్రామీణ  ఉపాధి హామీ  పధకం పనులు ,ప్రధానమంత్రి గ్రామీణ ఆవాస్ యోజన పధకంలో భాగంగా  నిర్మిస్తున్న  గృహ నిర్మాణ పనుల గురించి  నేషనల్ లెవల్ మోనిటరింగ్ టీమ్ సభ్యులతో చర్చిండం జరిగింది.

జిల్లాకు విచ్చేసిన  నేషనల్ లెవల్ మోనిటరింగ్ టీమ్ సభ్యులు జిల్లాలోని 4 మండలాల పరిధిలోని 12 గ్రామ పంచాయతీల్లో  జరుగుచున్న  ఉపాధి హామీ పథకం మరియు పి.ఎం.జి.ఏ.వై పధకం ద్వారా జరుగుచున్న పనులను పరిశీలిస్తారు. వీరి వెంట డ్వామా పి.డి  తిరుపతయ్య, హౌసింగ్ పి.డి  వేణుగోపాల రావు పాల్గొన్నారు.

Related posts

బంజారాహిల్స్ సీఐ శివచంద్ర పై సస్పెన్షన్ వేటు

Satyam NEWS

ఎలాంటి ఆసరాలేని వారికి ఉచితంగా న్యాయ సహాయం

Satyam NEWS

విశాఖలో నిండుకున్న వెంటిలేటర్ బెడ్స్: చోద్యం చూస్తున్న అధికారులు

Satyam NEWS

Leave a Comment