37.2 C
Hyderabad
May 2, 2024 14: 59 PM
Slider ముఖ్యంశాలు

అంకిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఉచిత కోచింగ్ సెంటర్

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి అంకిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఇవ్వబోతున్న ఉచిత పోటీ పరీక్షల అవగాహన సదస్సును మంగళవారం హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ప్రకటించిన 83 వేల ఉద్యోగాలకు సంబంధించి హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలో హైదరాబాద్ స్థాయిలో అంకిరెడ్డి ఫౌండేషన్ ద్వారా ఉచిత పోటీ పరీక్షల శిక్షణ ఇస్తున్నామని, మంచి అనుభవం ఉన్న ఫ్యాకల్టీని గోల్కొండ కోచింగ్ వారిని ఎంపిక చేశామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో చదువుకున్న యువతీ,యువకులు,నిరుద్యోగులు ప్రభుత్వ ఉద్యోగాలను పోటీ పడడానికి కావలసిన మెటీరియల్ పుస్తకాలను, నోటు పుస్తకాలను ఉచితంగా అందిస్తూ వారికి మధ్యాహ్న భోజన సౌకర్యం కూడా కల్పిస్తామని,14 అంశాలకు సంబంధించిన మెటీరియల్ కూడా ఇస్తామని అన్నారు.
ప్రతి 15 రోజులకు ఒకసారి పునశ్చరణ పరీక్షలు నిర్వహిస్తామని, యూనిఫాం ఉద్యోగాల కోసం గ్రౌండ్ కు సంబంధించినటువంటి శిక్షణను కూడా ఇవ్వనున్నట్లు,దాని కొరకు ఒక మంచి పి టి కూడా నియమించనున్నట్లు తెలిపారు.యువత అన్ని రంగాల్లో రాణించాలని,తన కాళ్ళమీద తాను నిలబడి సాధికారం,స్వావలంబన
సాధించాలని,సమాజానికి,రాష్ట్రానికి, దేశానికి ఉపయోగపడాలని,అందుకు కావలసిన లైఫ్ సైన్సెస్ కోచింగ్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు.లైఫ్ సైన్స్ లో కమ్యూనికేషన్ స్కిల్స్,సాఫ్ట్ స్కిల్స్, టెక్నికల్ స్కిల్స్,స్పోకెన్ ఇంగ్లీష్ వంటి
వాటిని కూడా నేర్పుతారని సైదిరెడ్డి తెలియజేశారు.
ముఖ్యంగా యువత నిర్వీర్యం కాకూడదని,తాను రాజకీయాలకు వచ్చిందే యువత కోసమని వారికి ఖచ్చితమైన దిశా చూపిస్తానని శానంపూడి సైదిరెడ్డి అన్నారు.ప్రతి మనిషిలోనూ దేవుడు అద్భుతమైన స్కిల్స్ ఇస్తాడని,వాటిని ఉపయోగించుకోవాలని ఒకసారి ఒక చిన్న ఆలోచన అద్భుతమైన ఫలితాలను ఇస్తుందని,ప్రపంచం మొత్తం కంప్యూటర్లు,సెల్ ఫోన్ లో ఇమిడి ఉందని వాటిని మంచి కోసం ఉపయోగించుకుంటే కచ్చితంగా ప్రపంచ పౌరునిగా ఎదగవచ్చని అన్నారు.ఈరోజు మనం చూసినట్లయితే కరోనా కష్ట సమయంలో వర్క్ ఫ్రమ్ హోం అని ఇంట్లో కూర్చొని ఇతర దేశాలలోని ఉద్యోగాలు కూడా చేశారని,అటువంటి స్కిల్స్ పెంపొందించు కున్నట్లైతే తప్పకుండా అందరు గొప్పగా ఎదుగుతారని అన్నారు.కోచింగ్ సెంటర్ కు అందులోని విద్యార్థులకు అందుబాటులో ఉండటానికి ఎల్లప్పుడూ ఐదుగురు అనుభవం కలిగిన మంచి ఉద్యోగస్తులను నియమిస్తున్నామని అన్నారు. విద్యార్థులు ఎప్పుడు ఎటువంటి కష్టం కలిగినా,ఎటువంటి అసౌకర్యం కలిగినా నేరుగా తనకు ఫోన్ చేసి మాట్లాడవచ్చు అని తెలియజేశారు.మన కోచింగ్ సెంటర్ నుంచి ఎక్కువ ఉద్యోగాలు సంపాదించి హుజూర్ నగర్ పేరు ప్రతిష్టను ఇనుమడింప చేయాలని సూచించారు.కోచింగ్ కు వచ్చిన ప్రతి ఒక్కరికి ఉద్యోగం రాకపోవచ్చు అయినా వివిధ రంగాలలో రాణించడానికి ప్రతి ఒక్కరికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా మంచి శిక్షణ ఇస్తామని సైదిరెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమములో గోల్కొండ ఫ్యాకలిటీ టీం విద్యార్థులు,వివిధ మండలాల టిఆర్ఎస్ పార్టీ నాయకులు, పార్టీ అధ్యక్షులు,ప్రజాప్రతినిధులు,
కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

గర్భిణీ పోలీసు సిబ్బందీ..జాగ్రత్త: విజయనగరం ఎస్పీ జూమ్ కాన్ఫరెన్స్…!

Satyam NEWS

మానసిక వికలాంగుల పట్ల సమాజానికి బాధ్యత ఉంది

Satyam NEWS

త్వరలో అన్ని జిల్లాల్లో కోవిడ్ టెస్టింగ్ ల్యాబ్ లు

Satyam NEWS

Leave a Comment