35.2 C
Hyderabad
April 27, 2024 13: 13 PM
Slider విజయనగరం

గర్భిణీ పోలీసు సిబ్బందీ..జాగ్రత్త: విజయనగరం ఎస్పీ జూమ్ కాన్ఫరెన్స్…!

#RajakumariIPS

మహిళా పోలీసు ఉద్యోగినులు కరోనా నియంత్రణ జాగ్రత్తలు తీసుకొని, తప్పనిసరిగా కోవిడ్ వేక్సిన్ వేయించుకొని కరోనా వైరస్ నుండి రక్షణ పొందాలని విజయనగరం జిల్లా ఎస్పీ రాజకుమారి, జూమ్ వీడియో కాన్ఫెరెన్స్ ద్వారా తెలియజేశారు. 

జిల్లా పోలీసు శాఖలో పనిచేస్తున్న మహిళా పోలీసు అధికారులు, సిబ్బందికి మరియు గర్భిణీలు, బాలింతలుగా ఉన్న సిబ్బందికి కరోనా వైరస్ నియంత్రణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించేందుకు, వారి సందేహాలు నివారించేందుకు, జిల్లా ఎస్పీ రాజకుమారి జిల్లాలో పనిచేస్తున్న మహిళా పోలీసు సిబ్బందితో జూమ్ వీడియో కాన్ఫెరెన్స్ నిర్వహించారు.

విజయనగరంలో తిరుమల హాస్పిటల్ గైనిక్ డాక్టర్ కృష్ణ శాంతి జూమ్ వీడియో కాన్ఫెరెన్స్ లో పాల్గొని మహిళా సిబ్బంది తీసుకోవాల్సిన జాగ్రత్తలు గురించి వివరించి, వారి సందేహాలు నివృత్తి చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీసు శాఖలో సుమారు 200 మంది మహిళా సిబ్బంది పనిచేస్తున్నారని, కరోనా సెకండ్ వేవ్ విస్తరిస్తున్న దృష్ట్యా, రాష్ట్ర డీజీపీ గౌతం సవాంగ్ ఆదేశాలతో, గర్భిణులుగా ఉన్న మహిళా సిబ్బందికి కరోనా వైరస్ నుండి రక్షణ పొందేందుకు వర్క్ ఫ్రమ్ హెూం సౌకర్యం కల్పించామన్నారు.

కరోనా వైరస్ నియంత్రణ గురించి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, కరోనా వేక్సిన్ పై ఉన్న సందేహాలు నివృత్తి చేసేందుకు తిరుమల హాస్పిటల్ డాక్టర్కృ ష్ణ శాంతి తో జూమ్ వీడియో కాన్ఫెరెన్స్ ఏర్పాటు చేశామన్నారు.

మహిళా పోలీసు సిబ్బంది తప్పనిసరిగా కరోనా వేక్సిన్ వేయించకొని, మాస్క్ శానిటైజర్, సోషల్ డిస్టెన్స్ పాటించి కరోనా వైరస్ నుండి రక్షణ పొందాలని మహిళా పోలీసు సిబ్బందికి జిల్లా ఎస్పీ సూచించారు.

తిరుమల హాస్పిటల్ గైనికాలిజిస్ట్ డా.కృష్ణ శాంతి జూమ్ వీడియో కాన్ఫెరెన్స్ లో మహిళా పోలీసు సిబ్బంది ఉద్దేశించి మాట్లాడుతూ -రెండో దశ కరోనా వైరస్ వ్యాప్తి దృష్ట్యా కరోనా జాగ్రత్తలు పాటించాలన్నారు. మాస్క్ లు ధరించడం, తరుచూ చేతులను శుభ్రపరుచుకోవడం, సోషల్ డిస్టెన్స్ పాటించాలన్నారు. మహిళా పోలీసు ఉద్యోగులలో గర్బిణిలు, బాలింతలుగా ఉన్న వారు పోషకాహారం తీసుకోవాలని, మెడిటేషన్ చేస్తూ కరోనా జాగ్రత్తలు పాటిస్తూ ఆరోగ్య వంతంగా ఉండాలన్నారు.

గర్భిణీలు తప్పనిసరిగా పల్స్ ఆక్సీ మీటరు, బీపీ చెక్-అప్ మిషన్లు అందుబాటులో ఉంచుకొంటే మంచిదన్నారు.

కరోనా వైరస్ నుండి రక్షణ పొందేందుకు తప్పనిసరిగా కరోనా వేక్సిన్ వేయించుకోవాలన్నారు. గర్బిణిలు, బాలింతలుగా ఉన్నవారు కూడా కరోనా వేక్సిన్ వేసుకోవాలన్నారు. ఐసోలేషన్ లో ఉండి ఎటువంటి ఆరోగ్య సమస్య తెలెత్తినా, వెంటనే డాక్టరును సంప్రదించి, ఆరోగ్యంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. మహిళా పోలీసు సిబ్బంది అడిగిన సందేహాలను డా  కృష్ణ శాంతి నివృత్తి చేశారు. ఈ జూమ్ వీడియో కాన్ఫెరెన్స్ లో జిల్లా పోలీసు అధికారులు, మహిళా పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

పాకాల ఏటి పై హైలేవల్ వంతెన నిర్మించాలి

Bhavani

10వ తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం

Satyam NEWS

శవమై కనిపించిన బెంగాలీ టీవీ నటి పల్లవి

Satyam NEWS

Leave a Comment