38.2 C
Hyderabad
April 28, 2024 21: 59 PM
Slider ముఖ్యంశాలు

ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరానికి విశేష స్పందన

#MedicalCamp

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గం గోపాలపురం గ్రామంలో ప్రపంచ మానవ హక్కుల సమితి, నార్కెట్ పల్లి కామినేని  వైద్యశాల సహకారంతో నిర్వహించిన ఉచిత మల్టీ స్పెషాలిటీ వైద్య శిబిరానికి విశేష స్పందన వచ్చింది. ప్రపంచ మానవ హక్కుల సమితి జాతీయ చైర్మన్ రావూరి బాలరాజు శుక్రవారంనాడు ఈ శిబిరాన్ని ప్రారంభించారు.

ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలలో వైద్య సదుపాయం అందక ఎంతోమంది ప్రాణాపాయ స్థితిని పొందుతున్నారని, అలాంటి వారిని ఆదుకోవడానికి ఇటువంటి వైద్య శిబిరాలను ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. 

గ్రామీణ ప్రాంత ప్రజలు వినియోగించుకొని వారి ఆరోగ్య సమస్యలను  తెలుసుకొని, సర్జరీ అవసరమైతే సకాలంలో చేయించుకుని ప్రాణాలు కాపాడుకోవాలని అన్నారు.

కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రపంచ మానవ హక్కుల సమితి జిల్లా చైర్మన్ శ్రీధర్ మాట్లాడుతూ ఈ వైద్య శిబిరంలో 6 వైద్య విభాగాలను ఏర్పాటు చేసి వచ్చిన 300 మంది రోగులకు ఉచితంగా బి.పి, షుగర్, ఈ సి జి  ఇతర రక్త పరీక్షలను నిర్వహించి వారికి అవసరమైన మందులను ఉచితంగా పంపిణీ చేశామన్నారు.

మహోన్నతమైన కార్యక్రమం గోపాలపురం గ్రామంలో ఏర్పాటు చేయడం చాలా ఆనంద దాయకమని అన్నారు. అనంతరం వాలంటీర్లను, విచ్చేసిన అతిథులను శాలువాలతో, ప్రశంసా పత్రాలతో సత్కరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ శాసనాల నాగ సైదయ్య, ఎంపీటీసీ చీకూరి రాజారావు, హుజూర్ నగర్ మున్సిపాలిటీ నాలుగవ వార్డు కౌన్సిలర్ ఓరుగంటి నాగేశ్వరరావు, ప్రపంచ మానవ హక్కుల సమితి జిల్లా అడ్వైజర్ కలకుంట్ల సైదులు, మహిళా విభాగ కార్యదర్శి షిరీన్ మహమ్మద్,కామినేని వైద్యశాల పిఆర్ఓ లు సతీష్, హెల్త్ సూపర్వైజర్ కే. ప్రమీల,హెల్త్ అసిస్టెంట్ ఇందిరాల రామకృష్ణ, పి.ఝాన్సీ రాణి, ఎం.విజయ శ్రీ   చందు,హుజూర్ నగర్ డివిజన్ కార్యదర్శి కాల్వ వినోద్, కెవి సత్యనారాయణ,సభ్యులు లోకసాని శ్రీనివాస్ రెడ్డి, శాసనాల రామారావు, అనిత,  భీమి శెట్టి గోపీనాథ్, కాల్వ సాయి, ఎలిశెట్టి వీరేందర్, కాల్వ బ్రహ్మం, ఆశా వర్కర్లు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.

Related posts

మాయమాటలు చెప్పి మోసం చేసిన ఘనుడు

Satyam NEWS

22న సెలవు ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరిన విహెచ్ పి

Satyam NEWS

మరణించైనా కాపు రిజర్వేషన్లు సాధిస్తా : హరిరామజోగయ్య

Satyam NEWS

Leave a Comment