38.2 C
Hyderabad
April 29, 2024 12: 47 PM
Slider ముఖ్యంశాలు

తిరుమల-మెడికోవర్ సహాయంతో పోలీసులకు ఉచిత వైద్య పరీక్ష

#medicover

విజయనగరం జిల్లాలో వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న క్రింది స్థాయి ఉద్యోగుల ఆరోగ్య పరిరక్షణకు తిరుమల – మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యం సహకారంతో ఇప్పటి వరకు 1469మంది పోలీసులకు ఉచితంగా వైద్య పరీక్షలను పూర్తి చేసినట్లుగా జిల్లా ఎస్పీ ఎం. దీపిక తెలిపారు.

ఈ  సందర్భంగా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ ఇటీవల కాలంలో పోలీసు ఉద్యోగులు ఆరోగ్యపరమైన సమస్యలతో తీవ్రమై ఇబ్బందులకు గురికావడం లేదా చిన్న వయస్సులోనే మృతి చెందడం జరగడంతో వారి ఆరోగ్యం పట్ల ఆందోళన చెందామన్నారు. పోలీసు సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకొని, జిల్లా వ్యాప్తంగా వివిధ పోలీసు స్టేషనుల్లో పని చేస్తున్న పోలీసులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలకు ప్రధాన కారణాలను గుర్తించి, చర్యలు చేపట్టాలని నిర్ణయించామన్నారు.

ఇందుకు జిల్లా ఎస్పీ తిరుమల – మెడికవర్ ఆసుపత్రి యాజమాన్యాన్ని సంప్రదించడంతో, పోలీసు సిబ్బందికి ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఆరోగ్య సమస్యలకు కారణాలను గుర్తించాలని కోరామన్నారు. ఇందుకు డా. కె. తిరుమల ప్రసాద్ సానుకూలంగా స్పందించి, వారంలో మూడు రోజులు పోలీసు కార్యాలయంలో ఆరోగ్య పరీక్షలు నిర్వహించేందుకు అంగీకరించారన్నారు. ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి ఆధ్వర్యంలో పోలీసు సిబ్బందికి వారంలో మూడు రోజులు ఆరోగ్య పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు చేసి, రోజుకు 100 మంది చొప్పున పరీక్షలు నిర్వహించే విధంగా ప్రణాళిక రూపొందించామన్నారు.

గత నెల 6న ఆరోగ్య పరీక్షలు ప్రారంభించి, ఇప్పటి వరకు 1469మంది సిబ్బంది కి వైద్య పరీక్షలను పూర్తి చేసామన్నారు. వీరిలో 614మంది సివిల్, 399మంది ఆర్మ్డ్ రిజర్వు, 101మంది పోలీసు శిక్షణ కళాశాల, 269 మంది హెూంగార్డులు, 27 మంది జిల్లా పోలీసు కార్యాలయం ఉద్యోగులు, ఇంటిలిజెన్సు, అవినీతి నిరోధకశాఖ, స్పెషల్ ఎన్ఫోర్సుమెంట్ బ్యూరో, ఇతర అనుబంధ విభాగాలకు చెందిన పోలీసులున్నారన్నారు.

వీరిలో ముగ్గురు ఆరోగ్య పరిస్థితి తీవ్రంగా ఉన్నట్లుగా గుర్తించామని, వారిలో ఒకరికి బైపాస్ సర్జరీ, మరో ఇద్దరికి ఏంజోగ్రాం పరీక్షలను నిర్వహించి, వైద్యుల పర్యవేక్షణలో చికిత్సను అందిస్తున్నామన్నారు. ప్రతీ ఒక్కరూ ఆరోగ్యం పట్ల అప్రమత్తంగా వ్యవహరించడం, ప్రత్యేక శ్రద్ధవహించడం, ప్రతీ రోజూ వ్యాయామం, యోగ, సమతుల్య ఆహారం తీసుకోవడంతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందవచ్చునని జిల్లా ఎస్పీ ఎం. దీపిక అన్నారు.

అనంతరం తిరుమల – మెడికవర్ ఆసుపత్రి ఎం.డి. డా. కే. తిరుమల ప్రసాద్ మాట్లాడుతూ – పరీక్షలు నిర్వహించిన అనంతరం, వైద్యులు సూచించిన ఆరోగ్యపరమైన సలహాలను ప్రతీ ఒక్కరూ పాటించాలని, పరీక్షల నివేదికలను డిజిటైలేజేషన్ చేసామని, ఏ సమస్య ఉన్నా ప్రాధమిక స్థాయిలో తమని సంప్రదిస్తే, ఆరోగ్య సమస్యలను నివారించే చర్యలు చేపడతామన్న భరోసాను కల్పించారు.

ఈ సందర్భంగా వైద్య పరీక్షలను నిర్వహించేందుకు ముందుకు వచ్చి, పోలీసు సిబ్బంది ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించి, ఆరోగ్యపరమైన సలహాలను, సూచనలను అందజేసిన తిరుమల – మెడికవర్ ఎం.డి. డా. కే. తిరుమల ప్రసాద్, గైనికాలజిస్టు డా. కృష్ణశాంతి, హృద్రోగ నిపుణులు డా. శరత్ కుమార్ పాత్రో, డా. చంద్రకుమారి, డా.వి.ఎన్.పద్మకుమార్ లను జిల్లా ఎస్పీ ఎం.దీపిక ప్రత్యేకంగా అభినందించి, సాలువలతో ఘనంగా సత్కరించి, జ్ఞాపికలను ప్రధానం చేసి, జిల్లా పోలీసుశాఖ తరుపున కృతజ్ఞతలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) అస్మా ఫర్దీన్, డా. కే. తిరుమల ప్రసాద్, డా. కృష్ణశాంతి, డా. జ్యోతి, డా. చంద్రకుమారి, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, సెంటర్ హెడ్ పద్మ కుమార్, ఎఓ పివి నారాయణరావు, ఎస్బీ సీఐలు విజయనాధ్, ఈ.నర్సింహమూర్తి, ఆర్.ఐ. గోపాల నాయుడు, రమణమూర్తి, ఆర్ఎస్ఎస్ఐలు నారాయణరావు, శ్రీనివాసరావు మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

వివాహ వేడుకలలో పాల్గొన్న సీనియర్ నేత జూపల్లి

Satyam NEWS

జూబ్లీహిల్స్ పెద్దమ్మ, బల్కంపేట ఎల్లమ్మ ఆలయాల మూసివేత

Satyam NEWS

బీజేపీకి కౌంటర్ సిద్ధం చేసుకుంటున్న కేసీఆర్

Satyam NEWS

Leave a Comment