29.7 C
Hyderabad
April 29, 2024 08: 11 AM
Slider వరంగల్

పోలీసు ఉద్యోగాలకు ములుగులో ఫ్రీ కోచింగ్

#MuluguCollector

ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు అర్హులైన అభ్యర్ధులకు ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ములుగు జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య చర్యలు తీసుకుంటున్నారు. ఈ సౌకర్యాన్ని ఉపయోగించుకోవడానికి అభ్యర్ధులు ఆన్లైన్ పోర్టల్ లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.

ఎస్సై, పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం సన్నద్ధమయ్యే అభ్యర్థుల కోసం క్లాస్ రూమ్ కోచింగ్ తో బాటు ఫిజికల్ ట్రైనింగ్ కూడా ఇస్తారు. దాదాపుగా వంద మంది ఎస్సీ అభ్యర్థులను ఎంపిక చేసి రెండు నెలల కోచింగ్ ఇస్తారు. సబ్ ఇన్స్పెక్టర్ పోస్టు కి ఏజ్ లిమిట్ 30 సంవత్సరాలు కాగా పోలీస్ కానిస్టేబుల్ పోస్టుకు ఏజ్ లిమిట్ 27 సంవత్సరాలు ఉంటుంది.

అదే విధంగా కుటుంబ సంవత్సరం ఆదాయం మూడు లక్షలు దాటకూడదు. అభ్యర్థి ప్రభుత్వ ఉద్యోగి అయి ఉండకూడదు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్ వెబ్ సైట్ అయిన http://tsstudycircle.co.in ద్వారా అప్లై చేసుకోవాలి. సబ్ ఇన్స్పెక్టర్ కి క్వాలిఫికేషన్ డిగ్రీ సర్టిఫికెట్ ఉండాలి.

పోలీస్ కానిస్టేబుల్ కి ఇంటర్మీడియట్ ఉండాలి. ఆన్లైన్ వెబ్ సైట్ 7 వ తేదీ నుంచి 12 వ తేదీ వరకు వెబ్సైట్ ఓపెన్ లో ఉంటుంది. మెరిట్ జాబితా ఆధారంగా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది.18 వ తేదీ నుండి క్లాసులు ప్రారంభం అవుతాయని జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన ద్వారా తెలిపారు. ఆసక్తి కలిగిన అభ్యర్థులు వెంటనే ఆన్ లైన్ ద్వారా వివరాలను నమోదు చేసుకోవాలని కలెక్టర్ కోరారు.

Related posts

కరీంనగర్ లోతట్టు ప్రాంతాల్లో మంత్రి గంగుల పర్యటన

Satyam NEWS

కూలీలుగా మారిన ప్రభుత్వ ఉద్యోగులు

Satyam NEWS

రైతులకు జిలుగు విత్తనాల పంపిణీ

Satyam NEWS

Leave a Comment