తమ తోటి స్నేహితుని కుటుంబ సభ్యులకు ఆర్దికంగా చేయూత ను అందించి స్నేహం గొప్పతనాన్ని మరోసారి గుర్తు చేశారు ఈ స్నేహితులు.
ములుగు జిల్లా జంగాలపల్లి గ్రామానికి చెందిన 1994- 95 బ్యాచ్ కు చెందిన స్నేహితులు ఈ సాయం అందించి పదుగురికి ఆదర్శంగా నిలిచారు.
వివరాల్లోకి వెళితే ములుగు మండలం జంగాలపల్లి గ్రామానికి చెందిన దుడపాక రాంచందర్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు.

విషయం తెలుసుకున్న ఆయనతో పాటు జంగాలపల్లి జిల్లాపరిషత్ పాఠశాలలో పదో తరగతి (1994 -95 ) చదువుకున్న చిన్ననాటి మిత్రులు ఆదివారం జంగాలపల్లి కి చేరుకొని మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, 50 కేజీల ఫైన్ రైస్, 3000 రూపాయల నగదును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు.
ఈ కార్యక్రమంలో మృతుడు రాంచందర్ స్నేహితులు వేల్పుల రమేష్ యాదవ్, సాదు రవి, కూనూరు మహేందర్ గౌడ్, ముత్యాల కుమారస్వామి, రేవూరి వాసులు, వీరన్న గౌడ్ తదితరులు ఉన్నారు.