29.2 C
Hyderabad
May 11, 2024 02: 07 AM
Slider ముఖ్యంశాలు

మార్చి 17 నుంచి ప్రజాగర్జన

#tammineni

బిజెపి ప్రమాదం ముంచుకొస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. నూతన ఆర్థిక విధానాలను మరింత వేగంగా అమలు చేస్తూ ప్రభుత్వ రంగ కంపెనీలను ప్రైవేటుకు ధారా దత్తం చేస్తుందని ధ్వజమెత్తారు.  బిజెపి వ్యతిరేక శక్తుల సమీకరణే లక్ష్యంగా పార్టీ ముందుకెళ్తోంది అన్నారు. రాజకీయ వైఖరీ రీత్యానే బీఆర్ఎస్ తో మైత్రి అని స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సీపీఎం జాతీయ కమిటీ పిలుపు మేరకు మార్చి 17వ తేదీ నుంచి ప్రజా గర్జన యాత్రలు ప్రారంభిస్తున్నట్లు  తెలిపారు. మూడు బృందాలుగా రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి ప్రారంభమయ్యే ఈ జాతాను విజయవంతం చేయాల్సిందిగా పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. 21వ తేదీన  ఏన్కూరులో జిల్లాలోకి ప్రవేశించే యాత్ర 25వ తేదీ వరకు కొనసాగుతుందని చెప్పారు. ఖమ్మం మంచి కంటి సమావేశ మందిరంలో  నిర్వహించిన పార్టీ జిల్లా విస్తృత సమావేశంలో తమ్మినేని మాట్లాడారు. తనతోపాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వీరయ్య, సాగర్ జాన్ వెస్లీ సారథ్యం వహిస్తారని వివరించారు. కార్పొరేట్ తొత్తుగా మారిన బిజెపి ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ ఈ యాత్ర కొనసాగుతుందని స్పష్టం చేశారు. మార్చి 17న పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సారథ్యంలో హనుమకొండలో ప్రారంభమయ్యే యాత్రను జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ప్రారంభిస్తారని చెప్పారు. ఆదిలాబాద్,  నాగర్ కర్నూల్ నుంచి మరో రెండు బృందాలు  యాత్రలు నిర్వహిస్తాయన్నారు. మార్చి 30వ తేదీ నాటికి హైదరాబాదులోని తుర్కయంజాల్ ప్రాంతానికి చేరుకుంటాయని తెలిపారు.

బిజెపి ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండకట్టడమే యాత్రల ప్రధాన ఉద్దేశంగా చెప్పారు. బిజెపి పాలనలో దేశ ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది అన్నారు. కార్పొరేట్లకు తొత్తుగా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ ఏటేటా దిగజారుతుందన్నారు. మరోవైపు మోడీ స్నేహితుడు అదానీ ప్రపంచ కుబేరుల జాబితాలో మూడో స్థానానికి ఎగబాకాడని తెలిపారు. అక్రమ పద్ధతిలో మోడీ ప్రభుత్వం అందించిన సహకారంతోనే అదానీ ఆ స్థాయికి ఎదిగాడని హిండెన్ బర్గ్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. ఈ నివేదికతో అదానీకి చెందిన రూ.12 లక్షల కోట్లు ఆవిరయ్యాయని తెలిపారు. మోడీ సహకారంతో గణనీయంగా పెరిగిన అదానీ గ్రూప్ సంస్థల షేర్ల విలువను చూపి రూ. లక్షల కోట్ల రుణాలు సేకరించారని వివరించారు. ఒక్క ఎల్ఐసి నుంచే రూ.80వేల కోట్ల రుణాలు తీసుకున్నట్లు తెలిపారు. హిండెన్ బర్గ్ నివేదికతో ప్రపంచ కుబేరుల జాబితాలో అదానీ మూడు నుంచి 30వ స్థానానికి దిగజారినట్లు చెప్పారు. బిజెపి వ్యతిరేక పక్షాలను బెదిరించేందుకే ఈడిని వాడుకుంటుందని, సుప్రీం జోక్యం చేసు కోపోయి ఉంటే… అదాని అక్రమాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీ ఏర్పాటుకు బిజెపి అంగీకరించేది కాదన్నారు. మరోవైపు గ్యాస్, ఎరువుల సబ్సిడీ, ఉపాధి నిధుల్లో కేంద్రం కోత పెడుతుందన్నారు. ఆర్యులే భారతీయ హిందువులుగా చరిత్ర వక్రీకరణకు బిజెపి పూనుకుంటుందన్నారు.

ఉత్తరాదిలో వస్తున్న వ్యతిరేకతను దక్షిణాదిలో పూడ్చుకోవాలని బిజెపి ప్రయత్నిస్తోందన్నారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కి భాగ్యలక్ష్మి ఆలయం మీద ఉన్న ప్రేమ, సచివాలయం గోపురాలు కూల్చడం పై ఉన్న శ్రద్ధ, ప్రజా సమస్యలపై లేదన్నారు. చాతుర్వరణ వ్యవస్థను పునఃస్థాపించటమే బీజేపీ ధ్యేయమన్నారు. బిజెపి వ్యతిరేక శక్తుల సమీకరణ జాతీయ కమిటీ నిర్ణయంగా పేర్కొన్నారు. మునుగోడు ఉప ఎన్నికలో బిఆర్ఎస్ నెగ్గకపోయి ఉంటే.. అసంతృప్త నేతలు బిజెపి దారి పట్టే వారని అన్నారు. అందుకే ఆ ఎన్నికల్లో కమ్యూనిస్టులు బిజెపికి మద్దతు ఇచ్చినట్లు తెలిపారు. రాజకీయ వైఖరి రీత్యా బీఆర్ఎస్ కు మద్దతు ఇచ్చామన్నారు. ఈసారి తెలంగాణ శాసనసభలో సిపిఎం అడుగుపెట్టడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు కర్తవ్యాలను పార్టీ సభ్యులకు ఉద్బోధించారు.‌

Related posts

పట్టణాల అభివృద్ధి టి‌ఆర్‌ఎస్ ప్రభుత్వం తోటే సుసాధ్యం

Satyam NEWS

రూ.1.27 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన

Satyam NEWS

డిసెంబర్ 17న 4వ తుగ్లక్ డే పాటిద్దాం

Satyam NEWS

Leave a Comment