30.7 C
Hyderabad
April 29, 2024 05: 33 AM
Slider నిజామాబాద్

బిటి రోడ్లు, జిపి భవనాలకు నిధుల మంజూరు

#gampagovardhan

కామారెడ్డి నియోజకవర్గంలోని బిటి రోడ్లకు, కొత్త జిపి భవనాలకు నిధులు మంజూరయ్యాయని ప్రభుత్వ విప్ గంప గోవర్ధన్ తెలిపారు. తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని 30 గ్రామ పంచాయతీలకు 20 లక్షల చొప్పున 6 కోట్లు మంజూరయ్యాయన్నారు. అలాగే నియోజకవర్గంలోని 12 బిటి రోడ్ల పునర్నిర్మాణానికి 34.71 కోట్ల నిధులు మంజూరైనట్టు తెలిపారు. కామారెడ్డి మండలంలోని ఇస్రోజీవాడి, క్యాసంపల్లి, కోటాల్ పల్లి, లింగాయిపల్లి, రాఘవపూర్, శాబ్దిపూర్ లెఫ్ట్ తండా, బిక్కనూరు మండలంలోని అయ్యవారిపల్లి ర్యాగట్లపల్లి, మోటాట్ పల్లి, సిద్ధరామేశ్వర నగర్, పెద్ద మల్లారెడ్డి, బిబిపేట మండలంలోని శివారు రాంరెడ్డిపల్లి, శేరి బిబిపేట, దోమకొండ మండలంలోని సీతాయిపల్లి, మాచారెడ్డి మండలంలోని ఆరేపల్లి తండా, భవాని పేట తండా, ఘన పూర్(ఎం), కాకుల గుట్ట తండా, బోడి గుట్ట తండా, లచ్ఛాపేట, నెమలి గుట్ట తండా, పాల్వంచ, రాజ్ ఖాన్ పేట, వెనుక తండా, ఎల్పు గొండ, రాజంపేట మండలం ఆరేపల్లి, పెద్దాయిపల్లి, రామారెడ్డి మండలంలోని భట్టు తండా, గొడుగు మర్రి తండా, జగదాంబ తండా, స్కూల్ తండా జిపిలకు ఒక్కొక్క జిపికి 20 లక్షల చొప్పున 6 కోట్లు నూతన భవనాలకు మంజూరయ్యాయన్నారు. నియోజకవర్గంలో ఇంకా 6 జిపిలకు నూతన భవనాలు మంజూరు కావాల్సి ఉందని, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు దృష్టికి కూడా తీసుకెళ్లడం జరిగిందన్నారు.

బిటి రోడ్లకు 34.71 కోట్లు

నియోజకవర్గంలోని 12 బిటి రోడ్ల పునర్నిర్మాణానికి 34.71 కోట్లు మంజూరయ్యాయని ప్రభుత్వ విప్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా చౌక్ నుంచి పోసానిపేట వయ అడ్లూర్, రంగంపేట మీదుగా రోడ్డు నిర్మాణానికి 2.11 కోట్లు, బిక్కనూర్-రాజంపేట వరకు 4.21 కోట్లు, గర్గుల్-రెడ్డిపేట 2.81 కోట్లు, భవానిపేట కేకేవై-ఇసాయిపేట, ఎల్లంపేట, సోమార్ పేట, రత్నగిరిపల్లి, గజేసింగవరం స్టేజి వరకు 5.81 కోట్లు, రెడ్డిపేట నుంచి సింగరాయిపల్లి, ఆరేపల్లి స్టేజి వరకు 3.72 కోట్లు, పాత రాజంపేట నుంచి క్యాసంపల్లి, ముత్యంపేట, దోమకొండ వరకు 3.94 కోట్లు, పాల్వంచ మర్రి నుంచి బిక్కనూర్ వరకు 2.60 కోట్లు, దోమకొండ నుంచి బిబిపేట వయ అంబారిపేట, కొనాపూర్, యాడవరం మీదుగా 2.83 కోట్లు, బిబిపేట నుంచి కొనాపూర్ 2.55 కోట్లు, దోమకొండ నుంచి చుక్కాపూర్ వరకు 1.17 కోట్లు, ఏల్లంపేట నుంచి మైసమ్మ చెరువు, రాజ్ ఖాన్ పేట నుంచి మాచారెడ్డి కేకేవై రోడ్డు వరకు 2.55 కోట్లు మొత్తం 12 రోడ్లకు 34.71 కోట్లు మంజూరయ్యాయని తెలిపారు. వీటి పనులను సత్వరమే టెండర్లు పిలిచి పనులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు.

Related posts

సక్సస్ స్టోరీ :కడక్‌నాథ్‌ కోళ్ల పెంపకంతో ఉపాధి

Satyam NEWS

కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న ఎమ్మెల్యే రోజా

Satyam NEWS

ఈ చీకట్లు త్వరలోనే తొలగిపోతాయి

Satyam NEWS

Leave a Comment