36.2 C
Hyderabad
May 8, 2024 17: 19 PM
Slider నల్గొండ

మైనార్టీ కార్పొరేషన్ బడ్జెట్ విడుదల చేయాలి

#huj

జనాభా దామాషా ప్రకారం బడ్జెట్ నిధులు పెంచి సబ్సిడీ యూనిట్లు పెంపుదల చేసి అర్హులందరికీ ఋణాలు ఇవ్వాలని హుజూర్ నగర్ ఆర్డిఓ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసి సీనియర్ అసిస్టెంట్ కమలాకర్ కి ముస్లిం మైనార్టీటీ నేతలు వినతి పత్రం అందచేశారు. రాష్ట్ర ప్రభుత్వం గత 7 సంవత్సరాలుగా ముస్లిం మైనార్టీలకు ఒక్క సబ్సిడీ లోన్లు ఇవ్వలేదని,రాష్ట్ర ప్రభుత్వం కేవలం 50 కోట్ల రూపాయలు కార్పొరేషన్ బడ్జెట్ విడుదల చేయడం మసి పూసి మారేడు కాయ చేసి చేతులు దులిపేందుకే అని,ఈ బడ్జెట్ ద్వారా ప్రయోజనం శూన్యమని ముస్లిం మైనార్టీ రాష్ట్ర నాయకుడు ఎండి.అజీజ్ పాషా అన్నారు.

ఈ సందర్భంగా మహ్మద్ అజీజ్ పాషా మాట్లాడుతూ సూర్యాపేట జిల్లా మొత్తానికి కేవలం 69 యూనిట్ల లోన్లు మాత్రమే మంజూరయ్యాయని,ఈ లెక్కల ప్రకారం ప్రతి మండలానికి 2 యూనిట్లు లోన్లు మాత్రమే వస్తాయని, దీనివలన లబ్ధిదారులకు లాభం కాకపోగా ఆర్థికంగా నష్టం వాటిల్లుతుందని,ఆన్లైన్ చార్జీలు కుల, ఆదాయ ధ్రువపత్రాలు ఇతర ఖర్చులు కలిపి సుమారు 1000 రూపాయలు ఖర్చు జరిగే అవకాశం ఉందని,దీనితో వేలాదిమంది దరఖాస్తులు చేసుకోవడం వలన ప్రభుత్వానికి ఆదాయం తప్ప లబ్ధిదారుల జేబులకు చిల్లు పడే అవకాశం ఉందని అజీజ్ పాషా తన ఆవేదన వ్యక్తం చేశారు.

బిఆర్ఎస్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ముస్లిం మైనార్టీలకు సబ్సిడీ ఋణాల కోసం స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా కేవలం 50 కోట్ల రూపాయల బడ్జెట్ ను మాత్రమే విడుదల చేసి అందరూ దరఖాస్తు చేసుకోవాలని ఉత్తర్వులు ఇచ్చారని, ఇది దారుణమైన విషయమని, కేవలం రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని ముస్లిం మైనార్టీ వర్గాలను మరొక మోసపూరిత విధానానికి పూనుకొని ఇంత తక్కువ బడ్జెట్ కేటాయించటం రాష్ట్ర ప్రభుత్వానికి తగదని అన్నారు. ఈ బడ్జెట్ కేవలం ముస్లిం మైనార్టీలకు మాత్రమే కాదని,ఇందులో ముస్లింలు, సిక్కులు, పార్శీలు,బౌద్ధులు, జైనులు ఈ తెగలకు కూడా ఇందులోకి వస్తారని,మరి ఈ తక్కువ బడ్జెట్ లో ఇంత మందికి సబ్సిడీ యూనిట్లు లోన్లు పంపిణీ చేయడం సాధ్యమేనా అని అజీజ్ పాషా రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ ప్రభుత్వం గత 2015 సంవత్సరం నుండి నేటి వరకు  ముస్లిం మైనార్టీ వర్గాలకు సబ్సిడీ ఋణాలు ఇవ్వలేదని,సుమారు 7 సంవత్సరాలుగా నాన్చి ఇప్పుడు కేవలం 50 కోట్ల బడ్జెట్ విడుదల చేసి ప్రజలను అయోమయానికి గురి చేస్తూ ఈ అరకొర బడ్జెట్ తో ముస్లిం మైనార్టీ వర్గాల మధ్య వైరుధ్యాలు పెంచి కొత్త పంచాయతీలు పెట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందని మహ్మద్ అజీజ్ పాషా ఆరోపించారు.

రాష్ట్ర ప్రభుత్వానికి ముస్లిం మైనార్టీల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే జనాభా దామాషా ప్రకారం తక్షణమే స్టేట్ మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ద్వారా 1000 కోట్ల రూపాయల బడ్జెట్ నిధులు విడుదల చేసి, అర్హులైన ముస్లిం మైనార్టీ సోదరులందరికీ సబ్సిడీ ఋణాల యూనిట్లు పెంపుదల చేసి,అర్హులైన ముస్లిం సోదరులందరికీ పారదర్శకంగా రాజకీయాలకు అతీతంగా  మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండి.అజీజ్ పాషా డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో ముస్లిం మైనార్టీ సోదరులు మహమ్మద్ గౌస్ ఖాన్,ఎండీ. సిరాజ్,ఎస్.కె రసూల్,ఇబ్రహీం,వంట మేస్త్రి జానీ,డ్రైవర్ ముస్తఫా,ఎస్కే.మోహిన్,ఎస్.కె దస్తగిరి,ఎస్కే భాష,ఎస్ కే జానీ,నయీమ్, మున్నా తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ హుజూర్ నగర్

Related posts

నేటి నుంచి ఇక మీకు కనపడను

Satyam NEWS

ప్రతీ మహిళల చేతిలో రక్షణ చక్రం “దిశా” యాప్

Satyam NEWS

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన వనపర్తి జిల్లా ఎస్పీ

Satyam NEWS

Leave a Comment