కేరళలోని సుప్రసిద్ధ శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించేందుకు వెళ్లిన 10 మంది మహిళా భక్తులను పంబ నుంచి వెనక్కి పంపేశారు. వీరంతా ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చారు. అందరూ 10 నుంచి 50 ఏళ్ల లోపువారే. మరోవైపు ఆలయం భద్రత దృష్ట్యా కేరళలో భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేశారు. ఆలయం చుట్టూ 10,000 మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. 2018 మాదిరిగా ఈసారి నిషేధ ఉత్తర్వులు జారీ చేయాల్సిన అవసరం లేదని పదనాంతిట్ట కలెక్టర్ తెలిపారు. గత ఏడాది మహిళా భక్తులకు కేరళ పోలీసులు భద్రత కల్పించగా, తాము ఈసారి భద్రత కల్పించలేమని కేరళ ప్రభుత్వం చేతులెత్తేసింది.
previous post
next post