లోకో పైలట్ చంద్రశేఖర్ కేర్ ఆస్పత్రి లో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. చంద్రశేఖర్ హెల్త్ బులిటెన్‌ను వైద్యులు విడుదల చేశారు. చంద్రశేఖర్ కాచిగూడ రైల్వే స్టేషన్‌లో సోమవారం ఉదయం రైలు ప్రమాదం జరిగింది. స్టేషన్ వీడి సికింద్రా బాద్ వైపు వెళ్తున్న ఎంఎంటీ ఎస్ రైలు అదే పట్టాలపై వస్తున్న హంద్రీనీవా ఎక్స్‌ప్రెస్ రైలును బలంగా ఢీకొట్టింది. రైలు వేగంగా ఢీకొట్ట డంతో క్యాబిన్‌లో చిక్కుకుపోయిన చంద్రశేఖర్ ను అంబులెన్స్‌లో నాంపల్లి కేర్ ఆస్పత్రికి తరలిం చారు.ఆయన పరిస్థితి విష మంగా ఉండడంతో వైద్యులు అతని కాలును తొలగించారు. అయినా అతని బాడీ వైద్య చికిత్స కు సహకరించక పోగా లివర్, కిడ్నీ, గుండె దెబ్బతిని మృతి చెందినట్లు కేర్ ఆస్పత్రి వైద్యులు తెలిపారు.
previous post