29.7 C
Hyderabad
May 2, 2024 06: 43 AM
Slider కరీంనగర్

స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాలను భావితరాలకు తెలియజేయాలి

#gangulakamalakar

భారత స్వతంత్రం కోసం  అహర్నిశలు  పోరాడిన వారి గురించి స్మరించుకుంటు వారి పోరాట నిరతిని, త్యాగాలను భావితరాలకు చాట్టిచెప్పేలా భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలను  నిర్వహించుకోవాలని రాష్ట్ర బీసి సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు.

స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా మంత్రి బుధవారం కరీంనగర్ హౌసింగ్ బోర్డు కాలనీ లొని 7వ డివిజన్ లో 26.40 లక్షలతో ఏర్పాటు చేసిన ఫ్రీడం పార్క్  ను ప్రారంభించారు.  అనంతరం కొత్తపల్లి గ్రామం లోని జడ్పీహెచ్ఎస్  పాఠశాలలో ఫ్రీడం పార్క్ లో రాష్ట్ర బీసి సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అధికారులు,ప్రజాప్రతినిధులతో కలిసి మొక్కలు నాటారు.

తదుపరి  వజ్రోత్సవాలలో బాగంగా జిల్లా కేంద్రంలోని ప్రతిమా మల్టిప్లెక్స్ లో విద్యార్థుల కోసం ప్రదర్శిస్తున్న గాంధీ చిత్రాన్ని అధికారులు ప్రజాప్రతినిధులతో కలిసి  గాంధీ చిత్రాన్ని చూశారు. ఈ సందర్భంగా మంత్రి  పాత్రికేయులతో మాట్లాడుతు  ప్రజలలో దేశభక్తిని పెంపొందించాలనే ఉద్దేశంతో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు.

భావితరాలకు సంపదను సృష్టించాలనే ఉద్దేశంతో రాష్ట్ర ముఖ్యమంత్రి ఆలోచన మేరకు  మొక్కలను నాటడం, ఆపదలో ఉన్న వారిని ఆదుకునేలా  రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం వంటి కార్యక్రమాలను అగస్టు 8 నుండి 22వ తేది వరకు రోజుకు ఒకటి చోప్పున నిర్వహించడం జరుగుతుందని  అన్నారు.  తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేసె గోప్ప కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతుందని, అందుకొరకు ప్రతి ఇంటికి జాతీయ జెండాలను అందించడం  జరుగుతుందని తెలిపారు.

రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ మాట్లాడుతూ,  భారత దేశం గోప్పగా ఎదిగిందని అన్నారు.  540  చిన్న చిన్నరాజ్యాలుగా ఉన్న భారతదేశాన్ని  మహాత్మాగాంధి, సర్దార్ వల్లబాయ్ పటేల్ వంటి ఎందరో మహనీయులు ఒకటిగా చేశారని అన్నారు.   నేటి తరానికి చరిత్రను గురించిన విషయాలు తెలియజేయాలనే సంకల్పంతో మన రాష్ట్ర ముఖ్యమంత్రి వజ్రోత్సవాలను నిర్వహణకు నిర్ణయించారని తెలిపారు. 

భారతదేశంలో ఎన్నో  గొప్ప ప్రాజేక్టులు,  కర్మాగారాలు,  రహాదారులను నిర్మించుకోవడం జరిగిందన్నారు.  మహత్ములను, మిశ్రమ ఆర్థిక వ్యవస్థలను రూపొందించిన వారిని కొందరు  కించపరిచే వ్యాఖ్యలను చేయడం బాధాకరమని అన్నారు. రాబోయె 25 సంవత్సరాలు 2047 వరకు భారతదేశం గొప్పగా అభివృద్దిని సాధిస్తుందని అన్నారు.

అనంతరం వజ్రోత్సవాలలో బాగంగా జిల్లా కేంద్రంలోని ప్రతిమామల్టిప్లెక్స్ లో విద్యార్థుల కొరకు ప్రదర్శిస్తున్న గాంధి చిత్రాన్ని అధికారులు, ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి తిలకించారు. ఈ కార్యక్రమంలో నగర మేయర్ వై. సునీల్ రావు పోలీస్ కమీషనర్ వి.సత్యనారాయణ, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్, డిప్యూటి మేయర్ చల్ల స్వరూపరాణి , మున్సిపల్ కమీషనర్ సేవా ఇస్లావత్,  ప్రజాప్రతినిధులు, అధికారులు, తదితరులు  పాల్గొన్నారు.

Related posts

కరెంటు చార్జీలకు వ్యతిరేకంగా కాంగ్రెస్ నిరసనలు

Satyam NEWS

నరసరావుపేట లో ఘనంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణ వేడుకలు

Bhavani

250కిలోల గంజాయి స్వాధీనం.. ఐదుగురు అరెస్ట్

Bhavani

Leave a Comment