27.7 C
Hyderabad
May 4, 2024 07: 39 AM
Slider గుంటూరు

పల్లెల సమగ్ర అభివృద్దే జగన్ ప్రభుత్వ లక్ష్యం

#ambatirambabu

ప్రభుత్వం ప్రతి సచివాలయ పరిధిలో మెరుగైన వనరుల, వసతుల  కల్పనకు రూ.20 లక్షల నిధులు వెచ్చించనుందని ఈ నిధులను వినియోగించుకొని అభివృద్ధిని వేగవంతం చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అంబటి రాంబాబు ప్రజా ప్రతినిధులను అధికారులు ఆదేశించారు.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న‘గడపగడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమం శుక్రవారం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండల పరిధిలోని ధూళిపాళ్ల గ్రామంలో జరిగింది.  ఈ సందర్భంగా గడపగడపకు మంత్రి అంబటి రాంబాబు తిరుగుతూ, ప్రభుత్వ పథకాలను వివరిస్తూ, సంక్షేమ లబ్ధిని, అభివృద్ధి తెలుసుకుంటూ పండుగ వాతావరణంలో గ్రామంలో పర్యటించారు.సాధ్యమైన సమస్యలను  అక్కడికక్కడే పరిష్కరిస్తున్నారు.మళ్లీ మీ ఆశీర్వాదం తీసుకోవడానికి మీ దగ్గరకు వచ్చామన్నారు.

ఈ మూడేళ్లలో కొరవడిన అభివృద్ధి పనులను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. సిసి రోడ్లు కల్వర్టులు, సైడ్ డ్రైన్లు, విద్యుత్ స్తంభాల ఏర్పాటు వంటి మౌలిక వసతులు కల్పనకు సచివాలయ నిధులు వెచ్చించనున్నామని పేర్కొన్నారు. గడపగడప కార్యక్రమంలో వచ్చిన సమస్యలను పరిష్కరించాలని ఆయన అధికారులను ఆదేశించారు.

ఈ కార్యక్రమంలో మండల కన్వీనర్  రాయపాటి పురుషోత్తమరావు నియోజకవర్గ యువజన నాయకులు కళ్ళం విజయభాస్కర్ రెడ్డి, ఎంపిపి యాలవర్తిపాటి షేక్ జైబూన్ బి, సంకటి సంసోను, సర్పంచ్ మహాలక్ష్మి, మర్రి సుబ్బారెడ్డి, బాసు లింగారెడ్డి,నలబోతు శివన్నారాయణ, అచ్యుత శివప్రసాద్ ,చిలకా జైపాల్ , అబ్బూరి వీరంజనేయులు,ఆరిగ కిషోర్ రెడ్డి,ఎంపీడీవో సత్యనారాయణ, వు,తహశీల్దార్ నగేష్, కార్యదర్శి శ్రీనివాసరావు , సచివాలయ సిబ్బంది ,మండల నాయకులు తదితరులు ఉన్నారు.

Related posts

పోడు పట్టాల ప్రక్రియ పూర్తి చేయాలి

Murali Krishna

రోమాలు నిక్కబొడుచుకునేలా సైరా టీజర్

Satyam NEWS

శుక్ర, శని, ఆదివారాల్లో వీఐపీ బ్రేక్‌ దర్శనాలు రద్దు!

Satyam NEWS

Leave a Comment