35.2 C
Hyderabad
May 1, 2024 00: 27 AM
Slider సంపాదకీయం

సిఎంకు అండగా ఉందాం సాక్షిని నిలబెట్టుకుందాం

sakshi paper

కరోనా సమయంలో ప్రకటనలు లేక పత్రికలు మూతపడుతున్నాయి కదా? మరి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై ఎస్ జగన్ మోహన్ రెడ్డికి సంబంధించిన సాక్షి పత్రిక ఏ విధంగా ఉంది? ఎన్ని కరోనాలు వచ్చినా సాక్షి పత్రికను ఏం చేయలేవు. నిజం. సాక్షి పత్రికకు ఉన్న స్టామినా అది.

రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఫుల్లు పేజీ యాడ్లు వచ్చేస్తుంటే దాని స్టామినా పెరగక తగ్గుతుందా? కరోనా వైరస్ తో ప్రజలు అల్లాడుతుంటే సాక్షి పత్రిక మాత్రం ప్రకటనల పండగ జరుపుకుంటున్నది. ముఖ్యమంత్రికి అండగా ఉందాం అంటూ ఇప్పటికే నాలుగు ఫుల్ పేజీ యాడ్లు విడుదల అయ్యాయి.

ఒక్కో యాడ్ ఖరీదు అక్షరాలా కోటీ 36 లక్షల రూపాయలు. ముఖ్యమంత్రి ఫొటో ప్రముఖంగా సంబంధిత శాఖ మంత్రి ఫొటో కింద వచ్చే ఈ ప్రకటనలో కరోనా పై తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఉంటాయి. ఇందులో ముఖ్యమంత్రికి అండగా ఉండటం ఏమిటో అర్ధం కాదు కానీ మరెన్నో యాడ్లు వచ్చే అవకాశం మాత్రం కనిపిస్తున్నది.

ఏ శాఖలో డబ్బులు ఉంటే ఆ శాఖ లోని ఆ విభాగానికి సాక్షి బిల్లు పంపుతుంది. దాన్ని అక్కడ నుంచి చెల్లించే ఏర్పాటు చేసుకుంటున్నారు. కరోనా పై జరుపుతున్న పోరాటానికి ఇన్ చార్జి అయిన ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, ఆరోగ్య శాఖ పర్యవేక్షించే ఆళ్ల నాని ఫొటో మాత్రం ఉండదు.

ఎవరి ఫోటో ఉన్నా లేకపోయినా డబ్బులు వచ్చేది సాక్షికే కాబట్టి ఎవరికి అభ్యంతరం లేదు. ఇప్పటికి ఐదు కోట్ల రూపాయలకు పైబడి సాక్షి ఖజానాలో జమ అయ్యయి. బిల్లు ఇచ్చారో లేదో తెలియదు కానీ ప్రభుత్వం ప్రకటన ఇస్తే డబ్బులు వచ్చేసినట్లే కదా.

8వ తేదీన విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ పేరుతో యాడ్ వచ్చింది. కోటీ 36 లక్షల రూపాయలు చెల్లించేస్తారు. పాపం ఆ శాఖకు చెందిన సమగ్ర శిక్ష లో పని చేసే వారికి రెండు మూడు నెలలుగా జీతాలు చెల్లించడం లేదు. మిగతా పత్రికల సంగతి తెలియదు కానీ సత్యం న్యూస్ మాత్రం ఈ విషయాన్ని రెండు మూడు సార్లు పోస్టు చేసింది.

పని చేసేవారికి జీతాలు ఇచ్చేందుకు చేతులు రావడం లేదు కానీ పత్రికలకు మాత్రం యాడ్లు వచ్చేస్తున్నాయి. ముఖ్యమంత్రికి అండగా ఉందాం అని లలితా జువెలర్స్ వారు ఫస్టు సాక్షి పత్రికకు యాడ్ ఇచ్చారు. వామ్మో ఇదేదో కాన్సెప్టు బాగుందని అన్ని ప్రభుత్వ శాఖలూ క్యూ కట్టేశాయి.

ఇప్పుడు ఈ వార్త రాయగానే వైసీపీ అభిమానులు ఏమంటారో తెలుసా? చంద్రబాబునాయుడు ఎల్లో మీడియాకు వందల కోట్లు దోచి పెట్టినప్పుడు కనిపించలేదా? మీరు కూడా ఎల్లో మీడియా లాగా వార్తలు రాస్తున్నారు అని విమర్శలకు దిగవచ్చు. దిగుతారు కూడా. అలా చేసిన పర్యవసానమే చంద్రబాబుకు 23 సీట్లు. మరి మనకూ వచ్చే ఎన్నికల్లో అన్ని సీట్లే కావాలా?

Related posts

పేదలకు ఏడాదిపాటు ఉచిత రేషన్

Bhavani

సమాన హక్కుల కోసం మహిళలు ఉద్యమించాలి: ఏ.పీ.టీ.ఎఫ్

Satyam NEWS

డిసెంబర్ 26న అంగరంగ వైభవంగా సంతోషం సౌత్ ఇండియన్ ఫిలిం అవార్డ్స్ 2022

Bhavani

Leave a Comment