40.2 C
Hyderabad
May 2, 2024 16: 02 PM
Slider మహబూబ్ నగర్

కొల్లాపూర్ శ్రీ వాణి విద్యా నిలయం లో గాంధీ వర్ధంతి

#kollapur

నాగర్ కర్నూల్ జిల్లా కొల్లాపూర్ పట్టణంలోని శ్రీ వాణి విద్యా నిలయం లో జాతిపిత మహాత్మా గాంధీ 74వ వర్ధంతి నిర్వహించారు. ముందుగా ఇందిరాగాంధీ అభిమాన సంఘం ఉమ్మడి జిల్లా అధ్యక్షులు రంగినేని జగదీశ్వరుడు గాంధీ మహాత్ముని చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. గాంధీ మహాత్ముడు దేశానికి చేసిన సేవలను వేనోళ్ళ కొనియాడారు. దేశ స్వాతంత్రం ప్రధాన లక్ష్యంగా భావించుకొని భారత ప్రజలను, నాయకులను ఏకం చేసి శాంతి యే ఏకైక ఆయుధంగా చేసుకొని తెల్ల దొరల పై పోరాటం చేసి వ్యక్తి మహాత్మా గాంధీ అని అన్నారు. ఆయుధ బలం గల బ్రిటిష్ వారిని ఎదిరించి దేశ ప్రజలను  బానిస బ్రతుకుల నుంచి కాపాడిన ఆ మహా త్యాగ నిస్వార్థ సేవకున్నీ భారత ప్రజలు ఆ సూర్య చంద్రాదులు ఉన్నంతవరకు మరువరని రంగినేని జగదీశ్వరుడు పేర్కొన్నారు. గాంధీ మహాత్ముని వర్ధంతి సందర్భంగా మహిళలకు బ్రెడ్ లు పండ్లు చిన్నారులకు నోట్ పుస్తకాలు, పెన్నులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో న్యాయవాది మధుసూదన్, మెహదీ నవాజ్ ,వెంకటస్వామి మేస్త్రి ,శేషన్న, జమీల్ ఖాన్, అహ్మద్ ఖాన్, జుబేర్ ఖాన్,కృష్ణ చైతన్య పాల్గొన్నారు.

Related posts

చట్టాలను అక్రమార్కులు చుట్టాలుగా భావిస్థారా!

Sub Editor

తొమ్మిదేండ్ల పాలనలో కేంద్రం అన్ని రంగాల్లో విఫలం

Bhavani

శ్రీమచ్చింతామణి వరసిద్ధి గణపతి సన్నిధిలో సంగీత విభావరి

Satyam NEWS

Leave a Comment