38.2 C
Hyderabad
April 28, 2024 19: 24 PM
Slider రంగారెడ్డి

చట్టాలను అక్రమార్కులు చుట్టాలుగా భావిస్థారా!

ameenpur lands

భూబకాసురులకు ఏరకం భూములైనా మొఖమాటం లేకుండా మింగేయటం ఒక ఆనవాయితీగా, వ్రుత్తిగా ఎంచుకున్నవారు లేక పోలేదు. ఈ కోవకు చెందినవారు అన్నిరంగాల్లో ఉన్న వ్యక్తులు, ప్రముఖులతో లావాదేవీలు జరపటం సర్వ సాథారణం అయ్యింది. ఆఖరికి చట్టాలను కూడా మోసగించడం పరిపాటి అయ్యింది.

మచ్చుకు అమీన్పూర్ మా నరేంద్ర నగర్ కాలని లేఅవుట్ ఒక గారడి ఒరవడికి పరాకాష్టగా భావించవచ్చు. ఈ లేఅవుట్ ను ఆవిష్కరించిన లేఅవుట్ యజమాని, దాని అనుబంధ యంత్రాంగ సిబ్బంది అంతా మాయల ఫ‌కీరులకు ఎంతో కొంత ఎక్కువే. ఈ కాలని లేఅవుట్ ఆరంభం నుండి ఇప్పటివరకు పరంపరగా లేఅవుట్ మోసాలకు అడ్డు లేకుండా పోయింది. పేరుకు నరేంద్ర ఆల్విన్ కాలని మాత్రమే. పటాన్ చెరు ఆల్విన్ పబ్లిక్ రంగ సంస్థ ప్రతి పాదిత డైరెక్టర్లలతో 1996 సం”ములో ఈ లేఅవుట్ కు ఒక పర్యవేక్షక హౌసింగ్ కమిటిని దిగుమతి చేశారు. ఈ కమిటి ఆల్విన్ ఉద్యోగస్తుల సంక్షేమం కోసం ఉద్దేశించినా, ఇక్కట ప్లాట్లు కేటాయించింది 99శాతం ఆల్వినేతర బయట ప్రజలకు మాత్రమే. దీనిని బట్టి వీరు ఆల్విన్ ఉద్యోగులు పట్ల చూపిన గౌరవం, నమ్మకం గురించి వేరే చెప్ప నక్కరలేదు. వీరికి స్వల్ప సంఖ్యలో లేఅవుట్ లో సభ్యులుగా ఉన్నఆల్విన్ సిబ్బందితో, ఒక కోరం, బైలాస్, ఆడిట్ సంస్థ లేకుండా కంపెనీకి ప్రతినిథిగా విచ్చేసిన లేఅవుట్ హౌసింగ్ కమిటి, ఒక ఉద్యోగుల సంక్షేమ కమిటిగా కాక, ఒక వ్యాపార సంస్థగా దినదినాభివృద్ధి చెందుతూ కొనసాగుతున్నారు.

అనారోగ్య కారణాలతో నో, వయస్సు భారంతోనో లేఅవుట్ యజమాని కరింగుల సత్యనారాయణ గౌడ్ 2004 సం”ము లోనే కాలం చేశారు. ఈ లేఅవుట్ చెయిర్మన్ అయిన మాజీ కేంద్ర మంత్రి అలే నరేంద్ర కూడా ప‌ర‌మ‌ప‌దించారు. అంటే లేఅవుట్ 1996 నుండి 2014 నాటి వరకు, ఆమాట కొస్తే ఇప్పటి వరకు ఈ లేఅవుట్ ను గ్రామ పంచాయతీకి బదిలీ చేయలేదు? కాక పోతే గ్రామ పంచాయతీ అధికారులే 2009 సం”ములో ఇళ్ళ పన్నులు కట్టమని సర్కులర్ విడుదల చేశారు. అయినా ఇక్కడి హౌసింగ్ కమిటి వారు ఇప్పటికి ఇక్కడ , క్రొత్త క్రొత్త ప్లాటు నెంబర్లను స్రుష్టిస్థూ, లేఅవుట్లను మారుస్తూ ప్లాట్లు అమ్ముతూనే ఉన్నారు. ఇప్పటికి 93, 1128, 39 సర్వే నెంబర్లలో, 2017, 2019, 2020 సం”ములలో ప్లాట్లు అమ్మిన దాఖలాలు ఉన్నాయి. ఇక వీరు చేసిన దురాగతాలు మాట కొస్తే వరుసగా 1.లేఅవుట్ డ్రాఫ్ట్ అంటే పట్టణాభివృద్ధి శాఖ వారికి ఒక నిఘంటువు లాంటిది. లేఅవుట్ సభ్యులకేమో అది మరి ప్రాణం వాయువు లాంటిది. అది ఒక చిత్తు కాగితం కాదు. పిచ్చి వ్రాతలు వ్రాసి మరల, మరల క్రొత్త కాగితాలు స్రుష్టించ లేము. కాని ఈ లేఅవుట్ లోని హౌసింగ్ కమిటి అంటే HAEHC, క్రొత్త ప్లాట్లు నంబర్లు స్రుష్టిస్తూ, ఎన్ని లేఅవుట్ కాగితాలు మార్చారో వారికే తెలియాలి.

వారు ప్రజల్లో నికి తెచ్చిన ఈ కాలని వేరు, వేరు లేఅవుట్ కాగితాల రాతల్లో ఏదో ఒక క్రొత్త మార్పులు కనపడుతూనే ఉంటాయి. ఒక్క ప్రథానమైన ఉదాహరణ-2006 సం”ము లో లేఅవుట్ లో క్రొత్తగా కలిసిన 39 సం, సర్వే నంబరు ప్లాటు నంబర్లు ఎలా 1996 సం”ము నరేంద్ర నగర్ కాలని లేఅవుట్ లో కలిశాయో? HAEHCనే చెప్పాలి. ఈ కమిటీ వారే ఏక పక్షంగా ఆల్విన్ సిబ్బంది ఒప్పందాలకు భిన్నంగా రు”లు 15000 ఉండే లేఅవుట్ అభి వ్రుథ్థి శుంకం 2007 సం”ము నాటికి రు70000 లు గా పెంచేయటం, ప్రతీ ప్లాటును కొనే వారు/అమ్మేవారు సైతం ఇద్దరు ఆ సుంకాలను భరించాల్సిందేనని, నిర్భంధం చేసి ఒక రేంజ్‌లో కోట్ల రూపాయలు సంపాదించి బొక్కసం లో వేసుకుంటూ సంవత్సరాల పాటు లేఅవుట్ ను 10-15 శాతం కూడా అభివృద్ధి చేయకుండా వదిలేశారు. వారి వ్యాపారం చక్క పెట్టు కోవటం తప్ప ఈ లేఅవుట్ ను గ్రామ పంచాయతీ కి అప్ప‌జెప్పింది లేదు.

2009 సం”ము నుండి మాత్రమే గ్రామ పంచాయతీ ఇక్కడ రోడ్లు వేయటం మొదలు పెట్టింది. అప్పటకి కూడా ఈ ముష్కరులు ఈ కాలానికి ముక్తి ప్రసాదించ లేదు. ఈ హౌసింగ్ కమిటీ వారే లేఅవుట్ లో సామాజిక స్థలాలను కూడా ఇతరులకు బదిలీ చేస్తూ, సరి హద్దుల్లో స్థలాలను, లేఅవుట్ లో తోటి లేఅవుట్ స్థలాల సరిహద్దులలో కొంత స్థలాలను కూడా ఆక్రమించు కుంటూ వారి స్వీయ సంపాదనను పెంచుకున్నారు. ప్రజలను వంచించిన విషయం కూడా లేక పోలేదు. లేఅవుట్ యాజమాన్యం ప్రక్కనే వేరే వారి స్థలంలో కామన్ సెప్టిక్ టేంక్ ఒకటి నిర్మాణం చేసి, 2012 సం”ము దాకా వాడిన‌ తర్వాత 2013 సం”ము లో ఆ స్థలం అసలు యజమాని వచ్చి, ఈ కామన్ సెప్టిక్ టేంక్ ను ప్రక్కన‌ ఉన్నవెంచర్ వారికి అమ్మేశారు. ఈ హౌసింగ్ కమిటి డైరెక్టర్లులో ఒకరు లేఅవుట్ లో రెండు చోట్ల మొత్తం ఎక2-14 గుం”ల స్థలంను లేఅవుట్ స్థాపన 1996 సం”ము తర్వాత మథ్యంతరంగా 2003 సం”ము లో ప్లాట్లు వేసి, అమ్ముకొని, రిజర్వేషన్ కూడ చేసి , అక్కడ ఉండాల్సిన రెండు పార్కు స్థలాలు లేకుండా అద్రుశ్యం చేశారు.

మరి రెండు పార్కు స్థలాలను మరొక డైరెక్టరు లేఅవుట్ యజమాని సతీమణి నుండి 2ఎక-3 గుం”లు పార్కు స్థలాన్ని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. HAEHC డైరెక్టరు ఒకరు లేఅవుట్ లో మరొక చోట 87,91 సర్వే నంబరులో 1022చ.గ”లు ప్లాట్లు స్థలాన్ని ప్రక్కనే ఉన్న వ్యవసాయ భూమి యజమాని పేరన సేల్ డీడ్ తో బదిలీ చేశారు. ఎక్కడైనా వ్యవసాయ భూమిని, నివాళిగా భూమిగా మార్చటం చూశాము కాని లేఅవుట్ భూమిని వ్యవసాయ భూమిగా మార్చటం చూడలేదు. HARHC ఇంకొక డైరెక్టరు ఆయన సతీమణి నుండి బినామిగా చేసి ఈ లేఅవుట్ లో ఏకంగా 21 ప్లాట్లు, ప్రథానంగా అన్నికార్నర్ ప్లాట్లు కొని భార్య పేరన రిజిస్ట్రేషన్ చేయించి, ఒక్కొక్కటి అమ్ముకుంటూ వస్తున్నాడు. ఇది కూడా పబ్లిక్ రంగ సంస్థలు డైరెక్టర్ల నిబంధనలకు వ్యతిరేకం.

ఇది ఇలా ఉంటే మన రాజ్యాంగం ప్రకరణం 74 ఎమెండ్మెంటు, పార్టు 3 అనుసరించి, 1994 ఏపి పంచాయితీ రాజ్ యాక్టు ప్రకారం 10% లేఅవుట్ పార్క్ స్థలాలకు బదులు అంటే 5 ఎక”లు పార్క్ స్థలం లేఅవుట్ లో ఉండవలసి వస్తే చట్టాలను కళ్ళు మూసి లేఅవుట్ ఇండెక్స్ లో 2ఎక-03గుం”లు మాత్రమే పార్క్ స్థలాలు చూపించారు. అది కూడా భౌతికంగా లేదు. జరిపిన పార్క్ స్థలాల అక్రమ రిజిష్ట్రేషన్ల వలన ఇప్పుడు ఒక అంగుళం పార్కు నేల కూడా ఇప్పుడు కనుపడుట లేదు. 55 సర్వే నం”లో,సి- బ్లాకు లో పార్క్ స్థలం అయితే 2008 సం”ము నాటికే గల్లంతై పోయింది. అసలు లేఅవుట్ నిబంధనల ప్రకారం 60 శాతం ఇండ్ల ప్లాంట్లకు, 40 శాతం ఇతర అవసరాలకు అనగా రోడ్లు, సామాజిక స్థలాలు, పార్క్/అంటే స్థలాలు, డ్రైనేజీ, కరెంటు స్తంభాలకు, వాటరు పైపు, సెప్టిక్ టేంకు మొదలైన వాటికి స్థలం ఉండాలి. అలాకాకుండా ఈ లేఅవుట్ లో 90 శాతం పైగా ఇండ్లకు మిగతా స్థలం బొటా బొటీగా రోడ్లకు వాడారు. తతిమ్మా పార్క్ లు, ఆట స్థలాలు, పబ్లిక్ స్థలాలు అన్నిహుష్ కాకి అయి పోయినవి.

2019 సం”ము లో 02ఎక-03గుం”లో పార్క్ స్థలాలను కాపాడమని హైకోర్టు చెప్పినా, అమీన్ పూర్ మునిసిపాలిటీ అదికారులు పెడ చెవిన పెడుతున్నారు. ఈ లేఅవుట్ లో ఏ- బ్లాకులో 93 సర్వే నంబరులో ఒక పార్క్ స్థలం సబ్ డివిజన్ కాకుండా ఉంది. ఇంకా ఆ స్థలం చాలా కాలం నుండి ఇతరులు ఆక్రమణలో ఉండి, స్థానిక ప్రజలు అనేక సార్లు మొత్తుకున్నా, 2020 సం”ము-జూలై లో 19, 20 తారీఖుల ప్రాంతములో అమీన్ పూర్ మునిసిపాలిటీ అథికారులు ఆక్రమణలను కొంతమేర తొలగించి, ఆ స్థలం అక్కడ ఎంత మేర ఉండాలి? అనే సాకుతో, ఆ స్థలాన్నిఇంత వరకు కొలతలు చేయించటం కాని, స్థలం బాగు చేయించి, కందకములు తీయించి, మొక్కలు నాటించటం కాని ఏమి చేయకుండా, కేవలం ఆక్రమణలు తొలగించటానికి డబ్బు వ్రుదా చేసి, ప్రజలకు ఉపయోగం లేకుండా చేశారు. ఇలాంటి అసంపూర్తి పనులవల్ల మరల ఆక్రమణదారులు తలెత్తే అవకాశం ఉండదా?లేండు ఎక్విజిషన్, ఎలైనేషన్ చట్టం ప్రకారం లేఅవుట్ పార్క్ స్థలాలు వగైరా స్థానిక సంస్థలు ఉచితంగా గిఫ్ట్ గా తీసికొన వచ్చునని స్పష్టంగా ఉంది. స్థానిక సంస్థలు ఆ స్థలాలను రిజిస్ట్రేషన్ చేయించుకొనే అధికారం లేక పోయినా, వారు ఆ స్థలాలు కస్టోడియన్ గా ఉండాలంటే, ఆ స్థలాలు గిఫ్టు డీడ్ వ్రాయించుకోవాలని లేఅవుట్ నిభందనలు ఉన్నవి. అలా చేయించ కుండా, ఆక్రమణలకు తావిస్తూ, లేఅవుట్ యజమానులు పట్ల అధికారులు సానుభూతి ఎందుకు చూపిస్తున్నారో, అది ప్రజల్లో ఎలాంటి సంకేతాలు ప్రసారితమవుతాయో, స్థానిక సంస్థల అదికారుల‌కే తెలియాలి. అధికారులుకు కూడా చట్టాలు పట్ల గౌరవం సన్న గిల్లుతుందా అని అనుమానం వస్తుంది. దీనికి కారణం సర్వత్రా అవినీతి పెరిగి పోవటమే కారణమవుతుందా? అయితే మా కాలని వాసులకు న్యాయం చేసే దెవరు?

Related posts

విఆర్ ఓ ల సర్దుబాటు వెంటనే పూర్తి

Bhavani

సన్నాసులపై పోరాటం చేసేందుకు ఇక ప్రత్యక్ష కార్యాచరణ

Satyam NEWS

అంబర్ పేట వర్కింగ్ జర్నలిస్ట్ అసోసియేషన్ నూతన కార్యవర్గం ఎన్నిక 

Satyam NEWS

Leave a Comment