35.2 C
Hyderabad
April 27, 2024 12: 43 PM
Slider ప్రత్యేకం

ఆదిమూలం నిర్ణయంతో షాక్ లో వైసీపీ నేతలు

#lokesh

సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మంగళవారం తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను కలిశారు. వచ్చే నెల 4 లేదా ఐదో తేదీన ఆయన టీడీపీలో చేరేందుకు సిద్ధమవుతున్నారు. తిరుపతి జిల్లాలోని సత్యవేడు నియోజకవర్గం నుంచి గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కోనేటి ఆదిమూలం గెలిచారు. ఇటీవల వైసీపీ హైకమాండ్ అభ్యర్థుల మార్పులు, చేర్పులలో భాగంగా ఆయనను తిరుపతి పార్లమెంటు ఇన్‌ఛార్జిగా నియమించింది. తనను సత్యవేడు నుంచి బయటకు పంపడానికి మంత్రి పెద్దిరెడ్డి కారణమంటూ కోనేటి ఆదిమూలం ఫైర్ అయ్యారు. దీంతో ఆయన వైసీపీని వీడి టీడీపీలో చేరేందుకు సిద్ధమయ్యారు. రెండురోజుల కిందట  మీడియాతో మాట్లాడిన ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం… మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. పెద్దిరెడ్డి తనను మోసం చేశారని ఆరోపించారు. పార్టీలో క్రమశిక్షణ, విశ్వసనీయత లేదంటూ విమర్శించారు. సొంత పార్టీ నేతలే తనను హింసించారని ఆవేదన చెందారు. వైసీపీలో ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాల పట్ల ఎలాంటి గౌరవం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదిమూలం మాట్లాడుతూ ఈ విషయాన్ని నేరుగా సీఎం వైఎస్‌ జగన్‌తో చర్చించాను. నేను 2 నెలలుగా చిత్రహింసలు అనుభవిస్తున్నాను. నారాయణ్‌ మండలం నా సొంత గ్రామం అయితే నన్ను తిరుపతి ఎంపీగా ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించాను. నాకు ఎంపీ సీటు కాకుండా ఎమ్మెల్యే సీటు ఇవ్వాలని, నాకు పోటీ చేసే అవకాశం ఇవ్వాలని, ప్రజలకు సేవ చేయడంలో నిరూపించుకుంటానని సీఎంను వేడుకున్నాను. అయినప్పటికీ, జగన్ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాలని పట్టుబట్టారు.”అని వివరించారు.

తనకు ఇష్టం లేకపోయినా తిరుపతి ఎంపీ స్థానం ఇన్ ఛార్జ్ గా ప్రకటించారని ఎమ్మెల్యే ఆదిమూలం అన్నారు. చెవిరెడ్డి, కరుణాకర్‌రెడ్డి, రోజా స్థానాల్లో మార్పులు చేయలగలరా? అని నిలదీశారు. సత్యవేడు నియోజకవర్గ ఆత్మీయ సమావేశాన్ని మంత్రి పెద్దిరెడ్డి ఇంట్లో నిర్వహిస్తారా? అని మండిపడ్డారు. సత్యవేడులో మంత్రి పెద్దిరెడ్డి అక్రమ ఇసుక తవ్వకాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ అక్రమాలకు బాధ్యుడ్ని చేసి నియోజకవర్గం నుంచి తనను తప్పించారని ఆరోపించారు. 30 ఏళ్ల క్రితం మోటారు సైకిల్‌పై తిరిగిన పెద్దిరెడ్డికి ఇప్పుడు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయన్నారు. మాజీ మంత్రి చెంగారెడ్డిని అడిగితే పెద్దిరెడ్డి ఆస్తుల చిట్టా బయటపడుతుందన్నారు. సత్యవేడు ప్రశాంతమైన నియోజకవర్గమన్నారు. ఇక్కడ అధికార, ప్రతిపక్ష నేతల్లో ఎవరిపైనా కేసులు లేవన్నారు.

తిరుపతి జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం తిరుగుబాటుతో వైసీపీ నాయకత్వానికి షాక్‌ కొట్టినట్లైంది. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో పెద్దిదిక్కుగా వ్యవహరిస్తున్న మంత్రి పెద్దిరెడ్డిపై ఇంతవరకు ఏ ఎమ్మెల్యే చేయని ఆరోపణలు చేశారు ఆదిమూలం. జిల్లాలో ఇంకో రిజర్వు నియోజకవర్గం పూతలపట్టులోనూ ఇలాంటి పరిణామాలే చోటుచేసుకున్నాయి.

ఎంపీని ఎమ్మెల్యేగా.. ఎమ్మెల్యేను ఎంపీగా పంపడం వల్లే ఈ సమస్య వచ్చిందని.. ఇద్దరినీ యథావిధిగా కొనసాగిస్తే ఎలాంటి ఇబ్బంది ఉండేది కాదంటున్నారు వైసీపీ కార్యకర్తలు. మొత్తానికి అటుఇటుగా చేసిన మార్పు ఎమ్మెల్యేలో అసంతృప్తిని రేపినట్లైంది. ఇదే వైసీపీలో ప్రకంపనలకు కారణమవుతోంది.

సాటి గంగాధర్, సీనియర్ జర్నలిస్టు, చిత్తూరు జిల్లా

Related posts

ఆర్య వైశ్యులకు ఉచితంగా కరోనా మందు పంపిణి

Satyam NEWS

నారాయణ…. నారాయణ… కాషాయ కమ్యూనిస్టు

Satyam NEWS

ఘనంగా ‘తెలంగాణ విమోచన’ దినోత్సవం

Satyam NEWS

Leave a Comment