40.2 C
Hyderabad
May 2, 2024 17: 19 PM
Slider ఖమ్మం

కావ్య హాస్పిటల్ లో ముగిసిన హెల్త్ చెకప్ క్యాంప్

#kavya

ఆధునిక పరికరాలతో గత రెండు రోజులనుండి ఖమ్మం కావ్య హాస్పిటల్లో ప్రివెంటివ్ వెల్నెస్ కంప్లీట్ హెల్త్ చెకప్ క్యాంప్ కార్యక్రమాన్ని నిర్వహించాము అని కావ్య హాస్పిటల్ డాక్టర్ కావ్యచంద్ యలమూడి తెలిపారు. దీనిలో భాగంగా అన్ని బాడీ చెకప్, షుగర్ పరీక్షలు, హార్మోన్ పరీక్షలు, విటమిన్ పరీక్షలు, మెటబాలిక్ ప్రొఫైళ్లతో కూడిన పరీక్షలను చేయటం జరిగిందని, చుట్టుపక్కల పరిసరాలు ప్రాంతల నుండి దాదాపు రెండొందల మంది ప్రజలు చూపించుకుని విజయవంతం చేశారని పేర్కొన్నారు.

ప్రస్తుతం కురుస్తున్న వర్షాల నేపధ్యంలో, సిజన్ వ్యాధి పట్ల ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్య స్థితిని మంచి ఆరోగ్యంతో ఉండటానికి 3 నెలలకు ఒకసారి ప్రివెంటివ్ వెల్నెస్ కంప్లీట్ హెల్త్ చెకప్ ను చేయించుకోవాలని సూచించారు. కావ్య హాస్పిటల్లో ప్రజల ఆరోగ్యం శ్రేయస్సు కొరకు 24X7 ఆరోగ్య సంరక్షణ సేవలను అందిస్తు, మెరుగైన ఆరోగ్యం కోసం పని చేస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో హాస్పిటల్స్ చైర్మన్ రవీందర్ యలమూడి, చీఫ్ ఆపరేషన్స్ ప్రసూన పారుపల్లి హాస్పిటల్ స్టాఫ్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

శివరాత్రి సందర్భంగా రామతీర్థం లో ఎన్సీసీ సేవలు

Satyam NEWS

డివిజన్ కేంద్రంలో ప్రభుత్వ కార్యాలయాలను తక్షణమే ఏర్పాటు చేయాలి

Satyam NEWS

పుడమిని నమ్ముకున్న రైతుకు మరణమే శరణ్యమా?

Satyam NEWS

Leave a Comment