18వ తేదీ సోమవారం రోజున వినాయక చవితి జరుపుకోవాలని పండితులు వెల్లడించారు. వినాయకచవితి ఎప్పుడు జరుపుకోవాలనే అనుమానం చాలా మందికి వస్తున్న నేపథ్యంలో ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ కాగజ్ నగర్ లోని త్రినేత్ర శివాలయంలో భజరంగ దళ్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ప్రముఖ వేద పండితులు ముద్దు రాజేంద్ర ప్రసాద్ శర్మ, సాయి రాం, ఓంకార్ శర్మ రాజేందర్ శర్మ,షణ్ముఖాచారి పాల్గొన్నారు. మన ప్రాంత వాడుకలో పంచాంగలలో అదే విధంగా ఉన్నదని.
18 వ తేది న అంటే సోమవారం రోజున ఉదయం 10.00 గం.లకు చవితి వస్తున్నందున అప్పుడే జరుపుకోవాలని, తరువాత సా.4.00 వరకు వినాయక స్థాపన చేయవచ్చునని వారు వెల్లడించారు. సా.4.30.ని.నుండి 6.20 వరకు వర్జ్యం ఉన్నందున ఆ సమయం వదిలి వేసి ఆ తరువాత మళ్ళీ రాత్రి వరకు మూర్తి స్థాపన చేసుకోవచ్చని తెలిపారు. మంగళవారం కూడ కొందరు చేసుకొవచ్చు అని అంటున్నారని, చవితి మంగళవారం ఉదయం 10 గంటల వరకు మాత్రమే ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ మంగళవారం చేయకూడదు అని వేద పండితులు తెలిపారు. అలాగే గణేష్ నిమజ్జనం 28 వ తేదిన గురువారం జరుపాలని భజరంగ్ దళ్ సభ్యులు తెలియజేశారు.