29.7 C
Hyderabad
May 2, 2024 05: 33 AM
Slider కవి ప్రపంచం

వర్షం

#sandhyarani erabati

సూరీడును దాచేస్తూ

ఉదయానికి ఒక మబ్బుతెర వేస్తావు

దోసిలిలో గుప్పెడు అనుభూతులను

దాచి పోతావు
ఆత్మీయoగా వస్తావు మరి

తిష్ట వేసుకొని కూర్చోవద్దంటాను

కరిగి కరిగి నీవు ప్రవహిస్తుంటే

ఇష్టంగా చూస్తూ ఉంటాను

రహస్యంగా రాత్రి నీవొస్తే

నింగి కబురు తెచ్చావనుకుంటాను

ఇదో చూడూ

నీవు

వెక్కివెక్కి రోదించినా

మా నగరంలో  నీకు చోటు లేదు

నా మది మాత్రమే నీకు గదిలా ఇవ్వగలను

స్వార్థం  మేడలరూపంలో విస్తరిoచి

నిన్ను ఆహ్వానించే తరులన్నీ

అదృశ్యం అయ్యాయి ఇక్కడ

నాలుగు చుక్కలు అత్తరులా నీవు చల్లినా

వీధి వీధిలన్నీ నదులవుతాయి

నీళ్ళ కోసం తిప్పలు పడ్డ మేమే

నానా మాటలతో నిన్ను

ఆడిపోసుకుంటాము

పాడు వర్షమని

వింటావా

అడవి మాత్రమే కాదు

పుడమిలా నేనూ నిన్ను

ప్రేమిస్తాను

అన్నం పండించే

రైతులా నిన్ను పూజిస్తాను

గగనపు గిరుల నుండి

రవ్వజల్లుల వంశీరవంలో

నవమౌక్తికముల శీకరములలో

రాధ నై చినుకుఅందెలతో

నర్తిస్తాను

నీవంటే నాకు ప్రాణం మరి..

వింటున్నావు కదూ

సంధ్యారాణి ఎరబాటి, డెట్రాయిట్, మిచ్చిగాన్

Related posts

డిసెంబర్ 29న జరిగే వ్యవసాయ కార్మిక సంఘం బహిరంగ సభ

Murali Krishna

భారీ పెట్టుబడి: తెలంగాణకు వస్తున్న అమర్ రాజా

Satyam NEWS

టిడిపి ప్రొద్దుటూరు ఇన్ చార్జిగా ప్రవీణ్ కుమార్ రెడ్డి

Satyam NEWS

Leave a Comment