48 ఏళ్ళు ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండి అధికారం పోయిన ఐదారు నెలలు కూడా ఓపికతో ఉండలేకపోవడం ఏమిటని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు ఎన్.చంద్రబాబునాయుడిని తెలుగుదేశం పార్టీ ఎంఎల్ఏ వల్లభనేని వంశీ మోహన్ ప్రశ్నించారు. కొత్త ప్రభుత్వానికి ఇంకా పురిటి వాసన కూడా ఇంకా పోలేదు. ఏ ప్రభుత్వానికి అయిన కొంత సమయం ఇవ్వాలి. వరదలు, ప్రకృతి వల్ల ఇసుక తీయడం కుదురుతుందా? వరదలు, వర్షాల్లో కూడా ఇసుక తీసే పరిజ్ఞానం చంద్రబాబుకి ఉందేమో తెలియదు అంటూ ఆయన ఘాటు విమర్శలు చేశారు. తెలుగుదేశం ఎన్నికలకు ముందు ఒక మాట తర్వాత ఒక మాట చెబుతుంది. దీంతో ప్రజల్లో విశ్వాసం పోతున్నది. పదేళ్ల క్రితం జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ పణంగా పెట్టి ప్రచారం చేశారు. ఆయన్ను చంద్రబాబు దూరం పెట్టారు. తెలుగుదేశం పార్టీలో అందరి పరిస్థితి అంతే అని ఆయన నిశితంగా విమర్శించారు. ధర్మ పోరాట దీక్షలు వద్దన్నా వినలేదు. ఏ ఎన్నికల్లోనూ టిడిపి ఒంటరిగా పోటీ చేసి గెలవలేదు. ప్రజలు మెచ్చి గెలిపించిన నాయకుడికి మద్దతివ్వల్సిన అవసరం ఉంది. ఇదే విధంగా టిడిపి వ్యవహరిస్తే తెలంగాణలాగే ఇక్కడ కూడా పార్టీ మిగలదు అంటూ ఆయన విమర్శలు సంధించారు.
previous post