28.7 C
Hyderabad
April 27, 2024 05: 37 AM
Slider విజయనగరం

దేవీ ఫోటో స్టూడియో చోరీ ఘ‌ట‌న‌లో జువైన‌ల్ పాత్ర‌

#Vijayanagarampolice

విజయన‌గ‌ర‌లో రెండు రోజుల క్రితం జ‌రిగిన చోరీ కేసును అన‌తి కాలంలోనే టూటౌన్ పోలీసులు ఛేదించారు. ఈ నెల 7న న‌గరంలోని మూడులాంత‌ర్ల వ‌ద్ద క‌స్పా  లేన్ లో దేవీ పోటో స్టూడియో లో చోరీ జ‌రిగింద‌ని టూటౌన్ పోలీసుల‌కు ఫిర్యాదు అందింది.

అనంత‌రం ద‌ర్యాప్తు చేపట్టి అది కొద్ది గంట‌ల‌లోనే చోరీకి గురైన సొత్తును నిందితుల‌ను ప‌ట్టుకున్నారు…టూటౌన్ పోలీసులు. ఈ చోరీ ఘ‌ట‌న‌లో ఓ జువైన‌ల్ ఉండ‌టం విశేషం. ఈమేర‌కు విజ‌య‌న‌గ‌రం స‌బ్ డివిజ‌న్ ఆఫీసులో డీఎస్పీ అనిల్ కుమార్,సీఐ శ్రీనివాస‌రావు, ఎస్ఐ బాలాజీలు సంయుక్తంగా మీడియా స‌మావేశంలో నిందితుడ్ని…స్వాధీనం చేసుకున్న సొత్తును మీడియా ముందు పెట్టారు. 

దేవీ ఫోటో స్టూడియోలో దొంగ‌త‌నం చేసిన నిందితుడు  నీలాపు దుర్గారావుతో పాటు జువినల్ ను అరెస్టు చేసి, వారి నుండి  2, లక్ష‌ల  50 వేల  200 రపాయ‌లు విలువ చేసే కెమెరాలను,దాంతో పాటు నగదును స్వాధీనం చేసుకున్నట్టు డీఎస్పీ అనిల్ కుమార్ తెలిపారు..

ఫిర్యాదు అందిన మేర‌కు   కేసును ఛాలెంజ్ గా తీసుకున్న‌ పోలీసులు  రెండు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, ఈ తరహా నేరాలకు పాల్పడే వ్యక్తులు గురించి ఆరా తీసారు.దీంతోఆ  తరహా నేరాలకు పాల్పడే పాత నేరస్థుడు చినపల్లివీదికి చెందిన 19 ఏళ్ల‌ నీలాపు దుర్గారావు  గురించారు  పోలీసుల విచారణలో నీలాపు దుర్గారావు సినిమా ఇండస్ట్రీలో

పని చేసినట్లు, మరో జువినల్ సహాయంతో దేవీ ఫోటో స్టూడియోలో దొంగ‌త‌నానికి పాల్పడినట్లు అంగీక‌రించాడు. అతని వద్ద నుండి చోరీ చేసిన 2.5 లక్షల విలువైన మూడు కెమెరాలను, కౌంటరు నుండి దొంగిలించిన  200/ల నగదును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని

విజయనగరం డిఎస్పీ పి.అనిల్ కుమార్ అభినందించారు. ఈ మీడియా స‌మావేశంలో హెచ్ సి సిహెచ్ వేణునాయుడు, కానిస్టేబుళ్ళు  రాంబాబు, హరికృష్ణ, టెక్నికల్ టీం సభ్యులు పాల్గొన్నారు.

Related posts

మనకు కొత్తేమీ కాదు కష్టాలు సహించడం నష్టాలు భరించడం

Satyam NEWS

అసలే ధరలు పెరిగి చస్తుంటే అందులో నీళ్ల కల్తీ…

Satyam NEWS

వరసకు కూతురు… అయితేనేం వాడు కామాంధుడు

Satyam NEWS

Leave a Comment