27.7 C
Hyderabad
April 30, 2024 07: 27 AM
Slider నల్గొండ

మోతె ఎస్సై మహేష్ ను తక్షణమే సస్పెండ్ చేయాలి

#SS Mahesh

నిరుపేదల సమస్యల పరిష్కారం కొరకు సిపిఎం పార్టీ మోతే మండల కమిటీ ఆధ్వర్యంలో విభలాపురంలో అర్హులైన పేదలకు డబల్ బెడ్ రూమ్ ఇండ్లు మంజూరు చేయాలని శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తుండగా మోతే మండల ఎస్సై మహేష్ ఆ ప్రాంతానికి చేరుకొని ఆవేశంతో,విచక్షణా రహితంగా అక్కడ ఉన్న పేదలపై దౌర్జన్యాన్ని ప్రదర్శిస్తున్న

సమయంలో నాయకులు అడ్డుకోగా సిపిఎం పార్టీ నాయకులను గల్లా పట్టి గుంజి నేలపై విసిరేసిన మోతే మండల ఎస్సై మహేష్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘం సిఐటియు అనుబంధం జిల్లా ప్రధాన కార్యదర్శి యల్క సోమయ్య గౌడ్ డిమాండ్ చేశారు.

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ నియోజకవర్గ కేంద్రంలోని భవన నిర్మాణ కార్మిక సంఘం కార్యాలయంలో శనివారం నిర్వహించిన సమావేశంలో యల్క సోమయ్య గౌడ్ మాట్లాడుతూ ఫ్రెండ్లీ పోలీసింగ్ అంటే ఇదేనా?ఫ్రెండ్లీ పోలీసింగ్ కి ఎస్ ఐ మహేష్ అర్థం మారుస్తున్నారని, శరీరంపై కాకి చొక్కా ఉంటే ఏదైనా చేయవచ్చు అనుకునే తన ఆలోచన సరైనది కాదని,పోరాడే హక్కు ప్రతి పౌరుడిపై ఉందని,పోరాడే తెలంగాణను సాధించుకున్నామని యల్క సోమయ్య గౌడ్ గుర్తు చేశారు.

ఈ కార్యక్రమంలో భవన నిర్మాణ సంఘం జిల్లా నాయకులు చల్లా జయకృష్ణ,ఉపతల్ల వెంకన్న గౌడ్, బాల శౌరెడ్డి,షేక్.ముస్తఫా,శీలం వేణు,నరేష్, అక్బర్,సాయి,నగేష్,నజీర్,రామకృష్ణ, నాగేశ్వరరావు,వెంకటేశ్వర్లు,సైదులు, ప్రభాకర్,అంజయ్య,అశోక్,నాగుల మీరా, తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

జగిత్యాల పట్టణ శివారు గ్రామాలను మాస్టర్‌ ప్లాన్‌ నుండి మినహాయిస్తాం

Bhavani

తల్లి, పిల్లలను కాపాడిన ఘనపురం పోలీస్

Satyam NEWS

కొల్లాపూర్ గాంధీ హై స్కూల్ లో ఘనంగా నవంబర్14

Satyam NEWS

Leave a Comment