28.2 C
Hyderabad
April 30, 2025 06: 15 AM
Slider ఖమ్మం

గ్యాస్‌ సిలిండర్‌ పేలి ఇల్లు దగ్ధo

#gascylinder

ఖమ్మం జిల్లా రఘునాధపాలెం మండలం పరిధిలోని పాపటపల్లి గ్రామంలో  గ్యాస్‌ సిలిండర్‌ పేలి రేకుల ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో వస్తువులు కాలి బూడిదయ్యాయి. ఇంటిలో ఉన్న వారు ప్రమాద సమయంలో వెంటనే బయటకి పరుగులు పెట్టడంతో ప్రాణాపాయం తప్పింది. పాపటపల్లిలో తోట ముత్తమ్మ ఇంటిలో రాత్రి సమయంలో ముత్తమ్మ , మనవరాలు, కుమారుడు ఉన్నారు. గ్యాస్‌ పైప్‌ నుంచి గ్యాస్‌ లీక్‌ అయ్యి హఠాత్తుగా ఇంట్లో మంటలు రావడంతో పరుగు పరుగున ఇంటి నుండి బయటకి వచ్చారు. గ్యాస్‌ సిలిండర్‌ ఒక్కసారిగా పేలి ఇంటిపై కప్పు రేకుల నుంచి బయటకు వచ్చి పడింది. పెద్ద శబ్ధం రావడంతో గ్రామస్తులంతా కేకలు వేస్తూ పరుగులు పెట్టారు. ఇంట్లో కాలుతున్న పలు వస్తువులను ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ అప్పటికే కాలి బూడిదయ్యాయి.  డబ్బులతో పాటు 5 ధాన్యం బస్తాలు. 3 చోడి బస్తాలు, దుస్తులు, రేషన్‌ కార్డు, గృహోపకరణ వస్తువులు కాలిపోయి నిలువ నీడలేనివారయ్యారు. దగ్ధమైన ఇంటికి జరిగిన నష్టంపై ప్రభుత్వం నుంచి నష్ట పరిహారం అందేలా చర్యలు తీసుకొని న్యాయం చేయాలని బాధితులు వేడుకుంటున్నారు.

Related posts

సంక్రాతి ఎఫెక్ట్ :పంతంగి టోల్ గేట్ వద్ద 2 కి.మీ మేర నిలిచిన వాహనాలు

Satyam NEWS

ఓటరు నమోదు ప్రత్యేక క్యాంపెయిన్ విజయవంతం చేయాలి

Satyam NEWS

అమరావతిపై కేంద్రం అఫిడవిట్ తో ఆందోళన వద్దు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!