26.7 C
Hyderabad
May 3, 2024 10: 10 AM
Slider మహబూబ్ నగర్

జియో సెల్ టవర్ పై మంత్రి సింగిరెడ్డికి ఫిర్యాదు

#ministerniranjanreddy

వనపర్తి పట్టణంలోని 30వ వార్డులోని సాయి నగర్ కాలనీ వెనకవైపు జియో కంపెనీ టవర్ వేస్తుండగా కాలనీ వాసులతో కలిపి ఆందోళన చేసి ఆపివేశామని వనపర్తి మునిసిపల్ వైస్ చైర్మన్(వార్డు కౌన్సిలర్) వాకిటి శ్రీధర్, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ చెప్పారు. అక్కడ ఉన్న జియో కంపెనీ వారిని అక్కడినుండి పంపించి,కాలనీ సభ్యులందరితో ఏకాభిప్రాయం కుదుర్చుకుని, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డికి, జిల్లా కలెక్టర్ కు  వినతి పత్రం రాసి ఇచ్చామని వారు తెలిపారు.ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ ఇల్లు ఉన్న దగ్గర టవర్  వేయకూడదని, ఉండకూడదని చెప్తూ కలెక్టర్ కు ఎండార్స్ చేశారు. మంత్రి నిరంజన్ రెడ్డికి వాకిటి శ్రీధర్, సతీష్ యాదవ్ ధన్యవాదాలు తెలిపారు. అక్కడి నుండి కలెక్టర్  ఆఫీస్ కు వెళ్లి వినతిపత్రం ఇచ్చారు. మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ మాట్లాడుతూ భవిష్యత్తులో  ఇండ్ల ముందు  సెల్ టవర్లు వేస్తే ఊరుకునేది లేదని, ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. వనపర్తి మునిసిపల్ వైస్ చైర్మన్ (వార్డు కౌన్సిలర్) వాకిటి శ్రీధర్ స్వామి, మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్ పిర్యాదుపై సంతకాలు చేశారు .ఈ కార్యక్రమంలో  మాజీ కౌన్సిలర్ సతీష్ యాదవ్, జంగిడి సురేష్, విలేకరి  రమేష్ రావు, రాజేష్, ఈశ్వరమ్మ, నరేష్, జింగిడి సతీష్,వెంకటయ్య, ఠాగూర్, బాలు,శివ, సత్యం, అనసూయ, పుష్ప, శ్రీనివాసులు, కాలనీ మహిళలు  పాల్గొన్నారు.

పొలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్

Related posts

కల్తీ సారా మరణాలన్నీ జగన్ రెడ్డి చేసిన హత్యలే: లోకేష్

Satyam NEWS

ఓ మహిళను ఆదుకున్న చిత్తూరు పోలీసులు

Bhavani

నిర్మలమ్మా… ఆత్మనిర్భర్ భారత్ ఆదుకోవడం లేదమ్మా

Satyam NEWS

Leave a Comment