38.2 C
Hyderabad
April 29, 2024 13: 46 PM
Slider గుంటూరు

పదిహేను రోజుల్లో నరసరావుపేటలో రోశయ్య విగ్రహం ఏర్పాటు

#gopireddysrinivasareddy

గుంటూరు జిల్లా ఆర్యవైశ్య సంఘం, నరసరావుపేట ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో భిష్మాచార్య అవార్డ్ గ్రహత కొణిజేటి రోశయ్య సంతాప సభను నరసరావుపేటలో పట్టణంలోని విజయకుమార్ కళ్యాణ మండపంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శాసనసభ్యులు డా. గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి రోశయ్య చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం మౌనం పాటించి అంజలి ఘటించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రాజకీయ కురువృద్ధుడు, అపర చాణక్యుడు అయిన రోశయ్య 1933 లో వేమూరులో జన్మించి, కాంగ్రెస్ పార్టీ తరపున 1968, 1974, 1980లలో శాసనమండలి సభ్యునిగా ఎన్నికయ్యారని తెలిపారు. తొలిసారిగా మర్రి చెన్నారెడ్డి ప్రభుత్వములో రోడ్డు రహదార్లు శాఖ, రవాణ శాఖల మంత్రిగా పనిచేసారు. ఆ తరువాత అనేక మంది ముఖ్యమంత్రుల హయాంలో పలు కీలకమైన శాఖలు నిర్వహించారని ఎమ్మెల్యే తెలిపారు.  ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవమున్న రోశయ్య 2009, సెప్టెంబర్ 3 నుండి 2010 నవంబరు 24 వరకు ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు నిర్వహించారని వివరించారు. 2011 ఆగస్టు 31న రోశయ్య తమిళనాడు రాష్ట్ర గవర్నరుగా ప్రమాణస్వీకారం చేశారు. 2016 ఆగస్టు 30 వరకూ తమిళనాడు గవర్నరుగా తన సేవలు అందించారని వివరించారు. 

రాజకీయాలలో తనదైన ముద్ర వేసిన రోశయ్య

ఎంత మంది దగ్గర పని చేసిన రోశయ్య మా వాడని చాలా మంది సీఎంలు చెప్పిన విషయాన్ని ఊటంకించారు. రాజకీయాల్లో తనకంటూ ఒక ముద్ర వేశారనన్నారు. వాక్ చాతుర్యం, సమయ స్పూర్తితో ప్రత్యర్థుల నోరు మూయించడం ఆయనకే దక్కుతుందని కొనియాడారు. పంచకట్టుతో రాజశేఖర రెడ్డి, రోశయ్య అసెంబ్లీలో కూర్చుంటే  ఆ ఇద్దరినీ చూడటానికి ముచ్చటగా ఉంటదని అన్నారు. రోశయ్య దెబ్బకి ఎన్టీఆర్ శాసనమండలినే రద్దు చేసిన విషయాన్ని ప్రస్థావించారు.

రాజశేఖరరెడ్డి తొలిసారి ముఖ్యమంత్రి అయ్యాక రోశయ్యే మా ఆర్థిక మంత్రి అని చెప్పగా.. మీడియా వాళ్లు ఆయన పాత మనిషిగా ఇప్పటి సంస్కరణలు ఆయనకు ఎలా అర్ధం అవుతాయని ప్రశ్నించారని దానికి వైఎస్ఆర్ సమాధానం చెబుతూ రోశయ్యను మించిన అధునిక వ్యక్తి మరోకరు లేరు అని చెప్పిన విషయాన్ని వివరించారు. వివాదరహితుడిగా పదువులకే వన్నె తెచ్చిన వ్యక్తి రోశయ్య అని పునరుద్ఘాటించారు. నరసరావుపేట నుంచి పోటీ చేసి కాంగ్రెస్ పార్టీ గెలవలేదు అన్నా వారి అనుమానాలన్నీ పటాపంచలు చేసి.. 98లో కాంగ్రెస్ పార్టీకి  మొట్ట మొదటి గెలుపును అందిచారని అన్నారు.

అతి త్వరలో విగ్రహం ఏర్పాటు

తాను రోశయ్య ను రెండు పర్యాయాలు కలిశానని ఎప్పుడు కలిసినా నియోజకవర్గం గురించి అడిగే వారిని తెలిపారు. నియోజకవర్గంలో రోశయ్య గారి విగ్రహ ఏర్పాటుకు పుర్తిసహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. రోశయ్య పెద్ద కర్మ లోపే విగ్రహ ఏర్పటుకు చేసుకోవాలని.. విగ్రహావిష్కరణ రోజు పేదలందరికి అన్నదాన కార్యక్రమం కూడా ఏర్పాటు చేయాలన్నారు.

ఈ కార్యక్రమంలో వైసిపి రాష్ట్ర కార్యదర్శి మిట్టపల్లి రమేష్, రొంపిచర్ల జెడ్పీటీసీ పిల్లి ఓబుల్ రెడ్డి, కపిలవాయి విజయ్ కుమార్, ముదిరాజ్ కార్పొరేషన్ డైరెక్టర్ స్వామి మాస్టర్, మిట్టపల్లి కళాశాలల అధినేత మిట్టపల్లి కోటేశ్వర రావు, పెనుగొండ వెంకటేశ్వర రావు, స్వచ్చ ఆంధ్రా కార్పొరేషన్ డైరెక్టర్ సుజాత పాల్, పాలపర్తి వెంకటేశ్వర్లు, విహెచ్పీ సాంబ, ఖాదర్ బాషా, ఊరా భాస్కర్, మార్కెట్ యార్డ్ వైస్ చైర్మన్ మజేటి సాంబశివ రావు, ఆర్యవైశ్య ప్రముఖులు, వైసిపి నాయకులు, ఇతర ప్రముఖులు పాల్గొన్నారు.

Related posts

జై శ్రీ రామ్

Satyam NEWS

ఒకే కాన్పులో ముగ్గురు పిల్లలకు జన్మనిచ్చిన తల్లి

Bhavani

రెండు నియోజకవర్గాలల్లో కువైట్ బాలయ్య ఫ్యాన్స్ అన్న వితరణ

Satyam NEWS

Leave a Comment