39.2 C
Hyderabad
May 3, 2024 11: 40 AM
Slider ముఖ్యంశాలు

భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి

#Godavari

ఎడతెరిపి లేని వర్షాల కారణంగా గోదావరికి ఎగువనున్న కాళేశ్వరం, ఇంద్రావతి నదులతోపాటు తాలిపేరు ప్రాజెక్టు నుండి వరదనీరు భారీగా గోదావరికి వచ్చి చేరుతుంది. దాంతో భద్రాచలం వద్ద గోదావరి 36 అడుగులకు చేరి ఉధృతంగా ప్రవహిస్తుంది. గోదావరి మరింత పెరిగే అవకాశం ఉందని సీడబ్ల్యూసీ శాఖ అధికారులు తెలిపారు.

ముంపు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ముంపునకు గురయ్యే గ్రామాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ముంపు మండలాలలో కలెక్టర్ ప్రియాంక పర్యటించారు. అనంతరం స్థానిక సబ్ కలెక్టర్ సమావేశపు హాల్లో అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అత్యవసర సేవలకు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 08744-241950, వాట్సప్ నంబర్ 9392919743కు మెసేజ్ కానీ వీడియో కానీ చేయాలని చెప్పారు. కొత్తగూడెం ఆర్డీఓ కార్యాలయంలో 9392919750, భద్రాచలం ఆర్డీఓ కార్యాలయంలో 08743-232444 నంబర్లు 24 గంటలు పని చేసే విధంగా ఏర్పాటు చేసినట్టు తెలిపారు. అత్యవసర సేవలకు ఎన్ డీ ఆర్ ఎఫ్ సిబ్బంది అందుబాటులో ఉన్నారని, వారి సేవలు వినియోగించుకోవాలని చెప్పారు. మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా వరద ఉధృతి పై సమీక్షించారు.

Related posts

మెడికల్‌ విద్యార్థిని ఆత్మహత్య

Bhavani

దీపావళి సందర్భంగా పితృదేవతలకు ప్రత్యేక పూజలు

Satyam NEWS

బ్లాక్ మెయిల్ చేసిన ముగ్గురు సూర్య పత్రిక విలేకరుల అరెస్టు

Satyam NEWS

Leave a Comment