27.7 C
Hyderabad
May 7, 2024 09: 44 AM
Slider వరంగల్

అంగన్‌వాడీ టీచర్ పోస్టులకు విశేష స్పందన

#Anganwadi

ములుగు జిల్లా  ప్రాజెక్ట్ పరిధిలోని 6 అంగన్వాడీ టీచర్ ఖాళీలకు దరఖాస్తులు కోరగా 169 మంది దరఖాస్తు చేశారు. అదే విధంగా 19 మినీ అంగన్వాడీ టీచర్ ఖాళీలకు 238, 31 మంది, అంగన్వాడీ ఆయా ఖాళీలకు 322 మంది అభ్యర్థులు అప్లై చేసుకున్నారు.

అభ్యర్థుల లిస్ట్ ను ప్రతి గ్రామ పంచాయితీ కార్యాలయానికి పంపారు. ములుగు ఐ. సి. డి. యస్ కార్యాలయంలో కూడా ఉంచారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికేట్స్ వెరిఫై చేసేందుకు వీలుగా అభ్యర్ధులు విద్యార్హత, కులం, నివాసం, వితంతువు అయితే భర్త మరణ దృవీకరణ పత్రం, దివ్యంగులు సదరం సర్టిఫికేట్, అనాధ లు అనాధ దృవీకరణ పత్రం, ఆదార్, వోటర్, రేషన్ కార్డ్ లను తీసుకుని వారి గ్రామపంచాయతికి కేటాయించిన తేదిన రావాలి.

జనవరి 21వ తేదిన బండారుపల్లి , బంజరుపల్లి, బరిగలపల్లి, గుర్తూర్ తండ, 22వ తేదిన భూపాల్ నగర్ , 23వ తేదిన దేవగిరిపట్నం, జగ్గన్నపేట్, జీవంతరావుపల్లి, కోడిశాలకుంట, మదనపల్లి, 25వ తేదిన జంగాలపల్లి, 27వ తేదిన మల్లంపల్లి,ముద్దునూర్ తండ, 28వ తేదిన పత్తిపల్లి,రాంచంద్రాపూర్, శివ తండ, 29 వ తేదిన ములుగు గ్రామపంచాయతిలకు సంబందించిన అభ్యర్ధులు హాజరు కావాల్సి ఉంటుంది.

కే.మహేందర్ గౌడ్, సత్యం న్యూస్, ములుగు జిల్లా

Related posts

బీజేపీ కార్యకర్తలు చురుకుగా పని చేయాలి

Satyam NEWS

నేరాన్ని బయటపెట్టిన గూగుల్ ఎర్త్

Satyam NEWS

సీఐడీ పోలీసులు కొట్టారు: న్యాయమూర్తి ఎదుట దారపనేని నరేంద్ర

Satyam NEWS

Leave a Comment