40.2 C
Hyderabad
April 28, 2024 16: 06 PM
Slider జాతీయం

ఆ సేవలపై వెనుకడుగు వేస్తున్న గూగుల్‌ పే.. బ్యాంకులకు నష్టమే..

google

కస్టమర్ల కోసం గూగూల్‌ కూడా ఎన్నో సర్వీసులను అందిస్తోంది. యూపీఐ విభాగంలో పలు సేవలను అందించాలనే గూగుల్‌ ప్రణాళిక ఆదిలోనే నిలిచిపోయింది. గతంలో గూగుల్‌పే యూజర్లకు ప్లెక్స్‌ సర్వీసులను అందించాలని భావించింది. ఇందుకు ప్లెక్స్‌ సర్వీస్‌ హెల్ప్‌తో డిజిటల్‌ బ్యాంక్‌ ఖాతాలు ప్రారంభించి, వాటి ద్వారా సర్వీస్‌ అందించాలని భావించింది.

ఫ్లెక్స్‌ సర్వీసెస్‌ సహాయంతో గూగుల్ పే యాప్ ద్వారా డిజిటల్‌ బ్యాంక్‌ ఖాతాలను అందించే ప్రయత్నాలపై గూగుల్‌ వెనక్కి తగ్గింది. గూగుల్‌ పే ద్వారా యూజర్ నిర్వహించే వివిధ రకాల సంప్రదాయ బ్యాంకులు అందించే చెకింగ్ లేదా సేవింగ్స్ ఖాతాల కోసం సైన్ అప్ చేయడానికి ఫ్లెక్స్‌ సర్వీసెస్‌ ద్వారా కస్టమర్లకు అందించాలని గూగుల్‌ భావించింది.

కాగా, గూగుల్‌ ప్లెక్స్‌ సర్వీసులతో యూజర్లు బ్యాంకు సేవలనుంచి దృష్టిమరల్చే అవకాశం ఉంది. గూగుల్‌ తీసుకువస్తోన్న ఈ ప్లెక్స్‌ సర్వీసులు పలు బ్యాంకులతో ప్రత్యక్షపోటీలో ఉండే అవకాశం ఉంటుందని బ్యాంకింగ్‌ నిపుణులు భావిస్తున్నారు. యూజర్లకు నెలవారీ లేదా ఓవర్‌డ్రాఫ్ట్ ఫీజులు లేకుండా, కనీస నిల్వలు లేకుండా ఖాతాలను అందించే అనేక రకాల ఆర్థిక సంస్థలతో భాగస్వామిగా ఉండటానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.

Related posts

సెల్లి చంద్రమ్మ బోనమెత్తింది..

Satyam NEWS

6నెలల్లో సంపూర్ణ అక్షరాస్యత రాష్ట్రంగా తెలంగాణ

Satyam NEWS

ములుగు జిల్లా అభివృద్ధి కమిటీ ఎన్నిక

Satyam NEWS

Leave a Comment