26.7 C
Hyderabad
May 3, 2024 11: 02 AM
Slider నిజామాబాద్

ఫైర్ ఆన్: కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం

#BJP Dichpally

రాష్ట్రంలో కరోనాను కట్టడి చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమవుతుందని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు యెండల లక్ష్మీనారాయణ అన్నారు. బీజేపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు కామారెడ్డి జిల్లా ఆస్పత్రి ముందు కరోనా కట్టడిలో ప్రభుత్వ తీరుకు నిరసనగా శాంతియుత ధర్నాలో పాల్గొనడానికి వచ్చిన ఆయనను పోలీసులు అరెస్ట్ చేశారు.

జిల్లా ఆస్పత్రి ముందు కొందరు కార్యకర్తలు ఆందోళన చేపట్టగా వారిని పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్ కు తరలించారు. నిరసనలో పాల్గొనకుండా బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు కాటిపల్లి వెంకట రమణారెడ్డిని ముందస్తుగా పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.

కరోనాను కట్టడి చేయలేక పోతున్న ప్రభుత్వం

ఈ సందర్బంగా యెండల లక్ష్మీనారాయణ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం కరోనాను కట్టడి చేయలేకపోతుందన్నారు. దేశంలో కరోనా మొదటి దశలో శాసన సభ సాక్షిగా కరోనా ప్రాణాంతకం కాదు,  పారాసేటమాల్ వేసుకుంటే పోతుంది అని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తు చేశారు.

మా ఎమ్మెల్యేలు మాస్కులు కట్టుకుని వచ్చారా అని వ్యంగంగా మాట్లాడారని అన్నారు. ప్రధాని మోడీ మొదటి దశ లాక్ డౌన్ విధించినప్పుడు ఒకడుగు ముందుకు వేసి రాష్ట్రంలో కూడా సీఎం కేసీఆర్ లాక్ డౌన్ విధించడం సంతోషిచదగిన విషయమని చెప్పారు.

ప్రస్తుతం కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గాంధీ ఆస్పత్రిలో చనిపోతున్న వారి సంఖ్య పెరుగుతోందని, చనిపోయిన వారి మృతదేహాలు ఎవరికి ఇస్తున్నారో తెలియడం లేదన్నారు. మృతదేహాల అప్పగింతపై నియంత్రిత చర్యలు లేవని ఆగ్రహం వ్యక్తం చేశారు. పాజిటివ్ వచ్చిన వారికి చికిత్స ఇచ్చే పరిస్థితి దారుణంగా తయారైందన్నారు.

ప్రతిపక్షాల మాటలతో పెంచిన టెస్టులు

4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కేవలం 57 వేల టెస్టులు మాత్రమే చేశారని అన్నారు. ప్రతిపక్షాలు, మీడియా వాళ్ళ ప్రోద్బలంతో టెస్టుల సంఖ్య పెరగడంతో కేసులు కూడా పెరుగుతున్నాయని తెలిపారు. నిన్న ఒక్కరోజే 730 కేసులు నమోదు కావడమే నిదర్శనమని చెప్పారు. పరీక్షల సంఖ్య పెరిగితే వేల సంఖ్యలో కేసులు బయట పడతాయని, వారికి చికిత్స చేస్తే మిగతా వారికి ఇబ్బంది ఉండదన్నారు.

మాటలు కోటలు దాటుతున్నాయి

సీఎం చెప్పే మాటలు కోటలు దాటుతున్నాయన్నారు యెండల. కేసులు ఎన్ని పెరిగిన చికిత్స అందించేందుకు సిద్ధంగా ఉన్నామని సీఎం చెప్తున్నారని, పాజిటివ్ వచ్చిన వాళ్ళు ఇంట్లోనే ఉండాలని సంబంధిత మంత్రి చెప్తున్నారని విమర్శించారు.

సామాన్యులు ఇంట్లో రెస్ట్ తీసుకోవడానికి నాలుగు గదులున్న ఇళ్ళు వాళ్ళకు లేవని తెలిపారు. తండ్రికి ఒకదగ్గర కొడుకుకు ఒక దగ్గర గెస్ట్ హౌస్ లు ఉన్నాయని దెప్పిపొడిచారు. మీరు రెస్ట్ తీసుకోవడానికి లక్ష ఫీట్ల గెస్ట్ హౌసులు కావాలని, సామాన్యుల పరిస్థితి అలా లేదన్నారు.

పక్క రాష్ట్రాల్లో టెస్టుల సంఖ్య పెంచుతున్నారు

35 లక్షల జనాభా ఉన్న త్రిపురలో 47 వేల టెస్టులు చేశారన్నారు. గుజరాత్ రాష్ట్రంలో రెండున్నర లక్షలు, పక్కనున్న ఏపీలో ఐదున్నర లక్షలు, కర్ణాటకలో నాలుగున్నర లక్షల టెస్టులు చేశారని గుర్తు చేశారు. నీకేమో టెస్టులు పెంచాలన్న సాయి లేకపోయే.. సోయి తేవాలని ప్రయత్నిస్తున్న మాలాంటి వాళ్ళను అరెస్ట్ చేయిస్తున్నావని విమర్శించారు.

ఆయుష్మాన్ భారత్ గొప్ప పథకం

ఆయుష్మాన్ భారత్ గొప్ప పథకామని యెండల లక్ష్మీనారాయణ అన్నారు. దేశం మొత్తం మీద 55 కోట్ల మంది ప్రజలకు లబ్ది చేకూరే ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ లో సీఎం కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని చేర్చడం లేదని తెలిపారు. ఈ పథకం ద్వారా ఒక్కొక్క కుటుంబం 5 లక్షల రూపాయల లబ్ది పొందే అవకాశం ఉందన్నారు.

రాష్ట్రంలో కోటి మంది ఈ పథకం ద్వారా లబ్ది పొందుతారని తెలిపారు. ఈ పథకంలో తెలంగాణను చేరిస్తే ప్రధానికి ఎక్కడ పేరు వస్తుందోనని కేసీఆర్ చేర్చడం లేదని, సీఎం కేసీఆర్ రాజకీయ కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. కనీసం ఆరోగ్యశ్రీకి అయినా నిధులు ఇస్తున్నారా అంటే అది లేదని ఎద్దేవా చేశారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని నిరుగారుస్తున్నారని తెలిపారు.

Related posts

గ్రీన్ ఈజ్ ద లైఫ్: మానవ మనుగడకు చెట్లే కీలకం

Satyam NEWS

బాబు మాటలు నయా పెత్తందారీ భావజాలానికి ప్రతీక…!

Bhavani

లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో వైద్య శిబిరం

Satyam NEWS

Leave a Comment