29.7 C
Hyderabad
May 1, 2024 04: 34 AM
Slider ఖమ్మం

ప్రభుత్వ అస్పత్రులపై నమ్మకం పెంచాలి

#hospital

మెరుగైన సేవలు అందించి, ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. కలెక్టర్ గత అర్ధరాత్రి జిల్లా ప్రధాన ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేశారు. మెటర్నిటీ లేబర్ రూమ్ ను సందర్శించి, డాక్టర్, సిబ్బంది విధులందు ఉన్నారా అని పరిశీలించారు. ఎన్ని కేసులు ఉన్నాయని అడిగి తెలుసుకున్నారు. క్యాజువాలిటి, ఐసియు లను పరిశీలించారు. డ్యూటీ డాక్టర్లు విధులందు ఉన్నది తనిఖీ చేశారు. రిజిస్టర్లు పరిశీలించి, ఎంతమంది ఇన్ పేషంట్లు ఉన్నది, రోజువారి ఓపి ఎంత ఉన్నది పరిశీలించారు. రోగులకు అందుతున్న సేవలను గురించి అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ ఆసుపత్రులకు ఎక్కువగా పేదవారు వస్తారని, వారికి సకాలంలో సరైన వైద్యం అందించాలన్నారు. ప్రభుత్వం నిధులు వెచ్చించి, ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని రకాల సదుపాయాలు కల్పిస్తున్నదని, అన్ని రకాల పరీక్షలు ఉచితంగా అందిస్తున్నదని, వైద్యులను అందుబాటులో ఉంచినట్లు ఆయన అన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న సేవలు రోగులకు అవగాహన కల్పించాలన్నారు. విధులు సక్రమంగా నిర్వర్తిస్తు, రోగుల పట్ల వైద్యులు మానవతదృక్పథంతో మెలగాలన్నారు.

Related posts

పరిస్థితి మారుతున్నది….గమనించండి పాలకులూ

Satyam NEWS

ట్రంప్ కృష్ణ:ట్రంప్ విగ్రహానికి తెలంగాణాలో పూజలు

Satyam NEWS

కే‌టి‌ఆర్ భార్య ది కూడా ఆంధ్రే

Murali Krishna

Leave a Comment