40.2 C
Hyderabad
April 29, 2024 18: 42 PM
Slider ప్రత్యేకం

ట్రంప్ కృష్ణ:ట్రంప్ విగ్రహానికి తెలంగాణాలో పూజలు

trump devotee

తెలంగాణ లో అమెరికా అధ్యక్షుడి కో గుడి ఉంది మీకు తెలుసా అక్కడ నిత్యం ఆయనకు పూజలు ప్రార్థనలు జరుగుతాయి .అక్కడ నిరంతరం ట్రంప్పు జపం చేసే ఆరాధకుడు ఒకరున్నారు.పుర్రెకో బుద్ది జిహ్వ కోరుచి అంటూనే వెర్రి వెయ్యి రకాలు అంటారు పెద్దలు ఇది వెర్రా అభిమానమా జనగామ జిల్లాలో నివసిస్తున్న ట్రంప్ కృష్ణ కోరుతున్న కోరిక విని అయన కథ చదివి మీరే చెప్పండి.


తన ఆరాధ్య దైవం యునైటెడ్ స్టేట్స్ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ను ఎలాగైనా కలిసే అవకాశం భారత పర్యటన సందర్భంగా తనకు కల్పించాలని ట్రంప్ వీరాభిమాని బుస్సా కృష్ణ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.జనగామ జిల్లా బచ్చన్న పెట్ మండలం కొన్నే గ్రామానికి చెందిన బుస్సా కృష్ణ కు ట్రంప్ పై ఉన్నది అభిమానం అనుకుంటే పొరపాటే తనను తాను ట్రంప్ కు భక్తుడి భావిస్తాడు.

అతను తన ఇంటి సమీపంలో అమెరికా అధ్యక్షుడి ట్రంప్ 6 అడుగుల విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేశాడు ,రోజూ ప్రార్థనలు చేస్తాడు. “ట్రంప్ ను ప్రార్థించడం ప్రారంభించిన తరువాత అతని అసలు పేరు బుస్సా కృష్ణ అయిన ప్పటికీ, గ్రామస్తులందరూ అతన్ని ట్రంప్ కృష్ణ అని పిలవడం ప్రారంభించారు. కృష్ణ నివాసం ను ఇక్కడ ట్రంప్ హౌస్ అని పిలుస్తారు.కాగా తన దేవుడు ట్రంప్ ను కలవాలనుకుంటున్న కృష్ణ మాట్లాడుతూ “భారతదేశం-అమెరికా సంబంధాలు బలంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను.

ప్రతి శుక్రవారం నేను ట్రంప్ కలకాలంవర్దిల్లాలని కోరుతూ ఉపవాసం ఉంటాను. నేనుట్రంప్ చిత్రాన్ని మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాకే ఏదైనా పని ప్రారంభిస్తానని అందుకే నేను ట్రంప్ ను కలవాలని కోరుకుంటున్నాను, నా కల నెరవేరాలని నేను ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నాను , “అని బుస్సా కృష్ణ సత్యం న్యూస్ తో తెలిపాడు.అతను నాకు దేవుడిలా నాకు అనిపించాడు అదే నేను అతని విగ్రహాన్ని నిర్మించటానికి కారణం. ఈ విగ్రహాన్ని నిర్మించడానికి 15 మంది కార్మికులు పనిచేయాగా దాదాపు ఒక నెల పట్టిందన్నారు.


పోటస్ పట్ల ఉన్న భక్తి కారణంగా గ్రామస్తులు ఆయనను ‘ట్రంప్’ కృష్ణ అని ఆప్యాయంగా పిలవడం ప్రారంభించారని అతని స్నేహితులు సత్యం న్యూస్ కి చెప్పారు.ఇతని చేష్టలకు గ్రామస్తులు ఎప్పుడూ అభ్యంతరం చెప్పలేదు, పైగా అతని భక్తిని మెచ్చుకున్నారు” అని బుస్సా స్నేహితుడు రమేష్ రెడ్డి అన్నారు.బుస్సా నివసించే కొన్నే గ్రామ సర్పంచ్ వెంకట్ గౌడ్ తన నమ్మకాలను గౌరవిస్తున్నామన్నారు.మరియు పోటస్‌ను కలవాలనే తన కలను నెరవేర్చాలని ప్రభుత్వాన్ని కోరారు.కాగా ప్రథమ మహిళ మెలానియా ట్రంప్‌తో కలిసి అమెరికా అధ్యక్షుడు రెండు రోజుల పర్యటనకు వస్తున్నా సందర్భంగా కృష్ణ చేష్టలను కొందరు మెచ్చుకుంటుండగా మరి కొందరు పబ్లిసిటీ కోసమేనని కొట్టి పారేస్తున్నారు.

Related posts

హనీ ట్రాప్ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులు

Bhavani

స్కీమ్ వర్కర్లను రెగ్యులరైజ్ చేయాలి : సీఐటీయూ డిమాండ్

Satyam NEWS

హిందూ,ముస్లిం,క్రిస్టియన్ స్మశాన వాటికలకు స్థలం కేటాయింపు

Satyam NEWS

Leave a Comment