38.2 C
Hyderabad
May 3, 2024 19: 27 PM
Slider విజయనగరం

మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు పై నిర్లక్ష్యం సిగ్గుచేటు

#municipalworkers

విజయనగరం లో మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమస్యలు హై పవర్ కమిటీ పేరుతో తాత్సరం చేయకుండా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తక్షణం పరిష్కరించాలని లేనియెడల తదుపరి జరిగే పరిణామాలకి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించక తప్పదని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి బుగత అశోక్ హెచ్చరించారు.

మున్సిపల్ కాంట్రాక్టు ఔట్సోర్సింగ్ కార్మికులు 2వ రోజు రాష్ట్ర వ్యాప్త సమ్మె లో బాగంగా ఈ మేరకు విజయనగరం లోని మూడు లాంతర్లు దగ్గర 10 నిమిషాలు రాస్తారోకో చేసి, అక్కడ నుంచి భారీ నిరసన ర్యాలీగా వచ్చి గంట స్థంభం దగ్గర 10 నిమిషాలు రాస్తారోకో నిర్వహించి విజయనగరం మున్సిపల్ నగర కార్యాలయం దగ్గర సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా బుగత అశోక్ మాట్లాడుతూ 11వ పీఆర్సీ ప్రకారం పెరిగిన వేతనాలు అమలు చేయడం లేదన్నారు,

ముఖ్యమంత్రి వాగ్దానం మేరకు అమలు చేస్తున్న హెల్త్ అలవెన్సు 6 నెలలు తరబడి దాన్ని అమలు చేయకుండా బకాయి పెట్టారని ఆవేదన వ్యక్తంచేశారు. మున్సిపల్ కార్మికులు గొంతెమ్మ కోర్కెలు కోరడం లేదని ప్రభుత్వం ఇచ్చిన జీఓల ప్రకారం స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులకు అమలు చేయాల్సిన వేతనాలు అమలు కానందున కార్మికులు తప్పనిసరి పరిస్థితుల్లో సమ్మెలోకి రావాల్సిన పరిస్థితి ప్రభుత్వమే తీసుకోచిందన్నారు.

ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తానే అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మినెంట్ చేస్తామని మాట ఇస్తున్నా మాట తప్పును అని వాగ్దానం చెసి నేడు ఆందోళనలు చేస్తుంటే మళ్ళీ నేను అధికారంలోకి వస్తే వేతనాలు పెంచుతామని మాట తప్పి మడమ తప్పారాని ఆరోపించారు. మీరు చెప్పే మాయమాటలకి మరోసారి మోసపోవడానికి కార్మికులు సిద్ధంగా లేరన్నారు. కార్మికుల రక్షణ పరికరాలు వంటి కనీస సమస్యలను కూడా పరిష్కరించడం లేదని గత 3 ఏళ్లల్లో ఏ ఒక్కటీ పరిష్కారం కాలేదన్నారు.

కరోనా సమయంలో విధులు నిర్వహిస్తు ప్రాణాలు కోల్పోయారని ఏ ఒక్కరి కూడా కరోనా వారియర్స్ కింద ప్రమాద బీమా ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్ మరియు వారి పిల్లలకి, మరణించిన కార్మికుల పిల్లలకి ఉద్యోగాలు ఇవ్వకపోవడం దారుణమన్నారు.

పట్టణ విస్తరణ పెరుగడం వలన పనిభారం తీవ్రంగా పెరుగుతుందని అందుకే కార్మికుల సంఖ్యను పెంచండని ఎన్నిసార్లు అడిగినా తీవ్రమైన నిర్లక్ష్యం చేస్తూ కార్మికుల సంఖ్య పెంచడం లేదని మండిపడ్డారు. మున్సిపల్ కార్మికులు చేస్తున్న డిమాండ్స్ ప్రభుత్వం పరిష్కరించలేని డిమాండ్స్ మాత్రం కాదు కానీ కమిటీల పేరుతో తాత్సరం చేస్తున్నారని విమర్శించారు. మున్సిపల్ రంగంలో పని చేస్తున్న కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులు, వాహన డ్రైవర్లకి హెల్త్ అలవెన్స్ ఇవ్వాల్సిందేనని అన్నారు,

సమాన పనికి – సమాన వేతనం, నాలుగు పూటల మస్టర్ విధానాన్ని ఎత్తివేయాలని, అలాగే ఆదివారం పూర్తి సెలవు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.అదేవిధంగా పనిభారం తగ్గించాలని, కార్మికులను పర్మినెంట్ చేయాలని, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించి ఆప్కాస్ విధానం నుండి కార్మికులను మినహాయించాలని, పర్మినెంట్ కార్మికులకి సరెండర్ లీవులు, హెల్త్ కార్డులు ఇవ్వాలని డిమాండ్ చేశారు.

మున్సిపల్ కార్మికుల సమ్మెతో పారిశుద్ధ్యం పని స్తంభించే పరిస్థితి ఉందన్నారు. వార్షాకాలం కావున వీధుల్లో చెత్త, చెదారం పేరుకుపోయిన ప్రజలు ఇబ్బందులు, అనారోగ్యపాలయ్యే ప్రమాదం ఉందన్నారు. తక్షణమే మంత్రులు, అధికారులు వెంటనే మున్సిపల్ కార్మికుల సమస్యలను మున్సిపల్ రంగంలోని జేఏసీ తో చర్చించి పరిష్కరించి సమ్మెను విరమింపచేయాలని కోరారు.

ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు ఎస్. రంగరాజు, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షులు జలగడుగుల కామేష్, సంతోష్, తుపాకుల శ్రీను, కళ్యాణ్ శ్రీను, దలాయ్ శ్రీను, కోడూరు. చిరంజీవి, జె. భాస్కరరావు, డి.సత్తిబాబు, కిషోర్ మరియు మహిళా కార్మికులు, డ్రైవర్లు తదితరులు పాల్గొన్నారు.

Related posts

జగన్ ప్రభుత్వ హాయాంలో జర్నలిస్టుల పై దాడులు జరగడం అన్యాయం…!

Bhavani

పెట్రోలు డీజిల్ ధరలు తగ్గించాలని ఆర్.డి.ఓ కు వినతిపత్రం

Satyam NEWS

నటి శ్రావణి ఆత్మహత్యతో నాకు సంబంధం లేదు

Satyam NEWS

Leave a Comment